Ind vs Aus, 1st T20: క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ఇవాళ టీమిండియా వర్సెస్ ఆసీస్ మధ్య జరుగాల్సిన తొలి టీ20 మ్యాచ్ ( Ind vs Aus, 1st T20) రద్దు అయింది. కాన్ బెర్రా వేదికగా మ్యాచ్ ప్రారంభం అయినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ తరుణంలోనే, టీమిండియా వర్సెస్ ఆసీస్ మధ్య జరుగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దు అయింది. ఈ మేరకు అంపైర్లు నిర్ణయం తీసుకుని, ప్రకటన చేశారు. దీంతో స్టేడియానికి వచ్చిన అభిమానులు నిరాశకు గురయ్యారు. అటు టీవీల్లో చూసే ఫ్యాన్స్ కూడా డీలా పడిపోయారు.
Also Read: Indian Team: ఎముకలు కొరికే చలిలో టీమిండియా ప్రాక్టీస్.. చేతులు పగిలిపోతున్నాయి.. వీడియో వైరల్
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ తొలి టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ వర్షార్పణం అయింది. మ్యాచ్ ప్రారంభమైన నుంచి ఒకటే వర్షం. దీంతో చేసేది ఏమీ లేక మొదటి టి20 మ్యాచ్ రద్దు చేసేసారు అంపైర్లు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసింది టీమిండియా. ఈ నేపథ్యంలోనే 9.4 ఓవర్స్ ఆడిన టీమిండియా ఒక్క వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసింది. అంటే ఓవర్ కు 10 రన్ రేట్ కొనసాగించింది. ఇక ఈ తరుణంలోనే వర్షం కంటీన్యూగా పడింది. దీంతో మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు అంపైర్లు ప్రకటన చేశారు.
టాస్ ఓడి, మొదట టీమిండియా బ్యాటింగ్ చేయగా, 5 ఓవర్లు ఆడిన తర్వాత వర్షం పడింది. దీంతో కాసేపు మ్యాచ్ నిలిపివేసి, ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభించారు. ఈ తరుణంలోనే 18 ఓవర్లకు మ్యాచ్ కుదించారు. ఆ సమయంలో సూర్య కుమార్ యాదవ్, శుభమాన్ గిల్ ఇద్దరూ దాటిగా ఆడారు. ఈ తరుణంలోనే 10 రన్ రేట్ కొనసాగించారు. సూర్య కుమార్ యాదవ్, శుభమాన్ గిల్ ఇద్దరూ మంచి దూకుడు మీద ఉన్న సమయంలో మరోసారి వర్షం అందుకుంది. ఆ వర్షం మళ్లీ ఆగలేదు. మళ్లీ ఆట ప్రారంభించలేని పరిస్థితి ఉందని గ్రహించి, మ్యాచ్ రద్దు చేశారు అంపైర్లు. కాగా ఈ మ్యాచ్ లో డేంజర్ ప్లేయర్ అభిషేక్ శర్మ 19 పరుగులు చేసి, ఔట్ అయ్యాడు.
టీమిండియా వర్సెస్ ఆసీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్ రద్దు కాగా మిగిలిన రెండు మ్యాచ్ లు ఇంకా ఆడాల్సి ఉంది. అక్టోబర్ 31వ తేదీన మెల్‌బోర్న వేదికగా రెండు టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇక నవంబర్ 2వ తేదీన హోంబర్ట్ వేదికగా చివరి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.