E-Paper
Advertisement

Ind vs sa 2nd T20 : నేడే రెండో T20..గిల్, సూర్యపైనే ఫోకస్.. ఉచితంగా చూడాలంటే..?

Ind vs sa 2nd T20 : నేడే రెండో T20..గిల్, సూర్యపైనే ఫోకస్.. ఉచితంగా చూడాలంటే..?

Ind vs sa 2nd T20 : టీమిండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా మ‌ధ్య 5 టీ-20 సిరీస్ జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ఇవాళ ముల్లాన్ పూర్ వేదిక‌గా రెండో మ్యాచ్ జ‌రుగ‌నుంది. తొలి టీ-20లో టీమిండియా 101 ర‌న్స్ తేడాతో గెలిచిన విష‌యం తెలిసిందే. ఇవాళ్టి మ్యాచ్ ల్లోనూ అదే జోరు కొన‌సాగించాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బౌలింగ్ లో మెప్పించిన భార‌త్ బ్యాటింగ్ లో కంగారు పెట్టింది. హార్దిక్ పాండ్యా మిన‌హా ఎవ్వ‌రూ పెద్ద‌గా రాణించ‌లేదు. అందుకే బ్యాటింగ్ పై మ‌రింత దృష్టి సారించాల‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ చేజారిన వ‌న్డే సిరీస్ గెలిచి జోరందుకుంది. అదే ఊపులో ఇప్పుడు తిరిగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. తొలి టీ-20లో స‌ఫారీల‌ను చిత్తు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే టీమిండియా ఇవాళ మ‌రో ఆస‌క్తిక‌రమైన పోరుకు సిద్ధం అయింది. రెండో టీ 20 మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

Also Read : ICC ODI rankings: నెంబ‌ర్ 1, 2 ర్యాంకింగ్స్ లో రోహిత్‌, కోహ్లీ..గంభీర్ ఇక ఉరేసుకోవాల్సిందే అంటూ ట్రోల్స్ ?

బ్యాటింగ్ లో భార‌త్ మెరుగుప‌డాల్సిందే

టీ-20 సిరిస్ లో తొలి మ్యాచ్ లో శుభారంభం చేసిన‌ప్ప‌టికీ బ్యాటింగ్ లో భార‌త జ‌ట్టు చాలా మెరుగుప‌డాల్సి ఉంది. తొలి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా చెల‌రేగ‌క‌పోయి ఉంటే జ‌ట్టు చాలా ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చేది. వైస్ కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్ చాలా ఒత్తిడిలో ఉన్నాడు. ఆసియా క‌ప్ లో టీ-20లోకి పున‌రాగ‌మ‌నం చేసిన‌ప్ప‌టి నుంచి అత‌ని ఆట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, సంజు శాంస‌న్ బాగానే రాణిస్తున్న‌ప్ప‌టికీ జ‌ట్టు మేనేజ్ మెంట్.. టీ 20 ఓపెన‌ర్ గా గిల్ సామ‌ర్థ్యం పై విశ్వాసం ఉంచింది.అప్ప‌టి నుంచి సంజు శాంస‌న్ తుది జ‌ట్టులో స్థానం కోసం తంటాలు ప‌డుతున్నాడు. గ‌త టీ 20 వ‌ర‌కు విరాట్ కోహ్లీ పోషించిన పాత్ర‌ను వ‌న్డే, టెస్ట్ కెప్టెన్ గిల్ స‌మ‌ర్థ‌వంతంగానే పోషించ‌గ‌ల‌డు. కానీ గిల్ ప‌వ‌ర్ ప్లే లో అభిషేక్ శ‌ర్మ‌లా బాద‌లేడు.

మ్యాచ్ ఉచితంగా ఎలా చూడాలంటే..?

తొలి టీ-20లో శుబ్ మ‌న్ గిల్ కేవ‌లం 4 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. మ‌రోవైపు కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఫామ్ కూడా కాస్తా ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఏడాది నుంచి నిల‌క‌డ‌గా ఆడ‌లేక‌పోతున్న సూర్య‌కుమార్ యాద‌వ్ పై ఇప్పుడు అంద‌రి దృష్టి ఉంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సూర్య‌కుమార్ యాద‌వ్ జ‌ట్టును న‌డిపించ‌నున్న నేప‌థ్యంలో అత‌ను ప‌రుగులు చేయ‌డం జ‌ట్ట‌కు చాలా అవ‌స‌రం. క‌టక్ లో జ‌రిగిన తొలి టీ 20లో సూర్య‌కుమార్ కేవ‌లం12 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. పేల‌వ ఫామ్ ను అదిగ‌మించ‌డానికి సూర్య‌కి ఈ సిరీస్ అద్భుత‌మైన అవ‌కాశం. మ‌రోవైపు ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్య తొలి మ్యాచ్ లో చెల‌రేగ‌డం టీమిండియా కు క‌లిసొచ్చే అంశం అని చెప్ప‌వ‌చ్చు. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్ లు అన్నీ కూడా జియో హాట్ స్టార్ లో ఎప్పటిలాగే రానున్నాయి. సబ్ స్క్రిప్ష‌న్ (SUBSCRIPTION) చేసుకున్న వాళ్లకు ఉచితంగా ప్రసారాలు వస్తాయి. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ లు తిలకించవచ్చు.

Also Read : Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×