BigTV English

IND Vs SA : సౌతాఫ్రికా కొత్త బౌలర్ ను ఎదుర్కోవడం ఎలా?.. భారత్ బ్యాటర్లకు సవాలేనా?..

IND Vs SA : సౌతాఫ్రికా కొత్త బౌలర్ ను ఎదుర్కోవడం ఎలా?.. భారత్ బ్యాటర్లకు సవాలేనా?..

IND Vs SA : సౌతాఫ్రికా పర్యటనలో ఆఖరిదైన రెండో టెస్ట్ గెలిచి, సిరీస్ ను సమం చేసి గౌరవప్రదంగా ఇండియా తిరిగి రావాలని టీమ్ ఇండియా కృత నిశ్చయంతో ఉంది. అందుకే ముమ్మర ప్రాక్టీసులో మునిగి తేలుతోంది. ముఖ్యంగా ప్రధాన ఆటగాళ్లు అందరూ కూడా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.


అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉండి కూడా విరాట్ కొహ్లీ నెట్స్ లో గంటల కొద్దీ శ్రమిస్తున్నాడు. మిగిలిన యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. తనే చెమటలు కక్కుతూ ప్రాక్టీస్ చేస్తుంటే,  తాము అంతకన్నా ఎక్కువ కష్టపడాలనే భావనతో శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

ముఖ్యంగా శ్రేయాస్ ప్రత్యేకంగా షార్ట్ పిచ్ బంతుల బలహీనతను అధిగమించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. త్రో బౌలర్స్ తో ప్రత్యేకంగా ఆ బాల్స్ వేయించాడు. అయితే అనుకోకుండా ఒక బాల్ పొట్టపై తగిలి, తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఎట్టకేలకు కోలుకొని యథావిధిగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.


విరాట్ కొహ్లీ అయితే సౌతాఫ్రికా ఎడమచేతి వాటం పేసర్, కొత్త బౌలర్ అయిన బర్గర్ కి కళ్లెం వేయడానికి, ఎడమ చేతి బౌలర్లతో ప్రాక్టీస్ చేశాడు. అయితే వాళ్లు నెమ్మదిగా వేయడంతో, వాటిని బాగానే ఎదుర్కొన్న కొహ్లీ, మరి పేసర్ బర్గర్ వేగాన్ని ఎలా అడ్డుకుంటాడనేది వేచి చూడాలి. టీమ్ ఇండియాలో ఎడమ చేతి వాటం బౌలర్ లేకపోవడం, ఆ తరహా ప్రాక్టీస్ లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది.

ఇక టీమ్ ఇండియా ప్రధాన బౌలర్లు అయిన బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ తదితరులతో కూడా మన బ్యాటర్లు ప్రాక్టీస్ చేశారు. గాయపడిన శార్దూల్ ఠాకూర్ కూడా కోలుకున్నాడు. నెట్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. రోహిత్ శర్మ కూడా వళ్లు వంచి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. టీమిండియాలో టెస్ట్ జట్టు ఆటగాళ్లందరూ చాలా కసిగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా మ్యాచ్ గెలిచి, పరువు దక్కించుకుని ఇండియాలో దిగాలని భావిస్తున్నారు. మరి సౌతాఫ్రికా బౌలర్లను ఎలా ఎదిరిస్తారో ఇక క్రీజులో చూడాల్సిందే.

Related News

RCB – Lalit Modi: అమ్మకానికి RCB… లలిత్ మోడీ చేతిలోకి వెళుతోందా… ఎన్ని కోట్లంటే ?

Watch Video : పాక్ గ‌డ్డ‌పై జై హింద్ నినాదాలు.. అఫ్ఘానిస్తాన్ స్టూడెంట్స్ ర‌చ్చ రంబోలా..గూస్ బంప్స్ వీడియో

Ind vs Pak Toss: ఫైన‌ల్ లో టాస్ ఫిక్సింగ్‌..? షాకింగ్ వీడియో వైర‌ల్‌…పాక్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Arshdeep Singh : పాకిస్తాన్ అభిమానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన అర్ష్ దీప్… వాడు ఏడవడం ఒక్కటే తక్కువ

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్… ఎప్పుడంటే ?

Asia Cup Trophy 2025: న‌ఖ్వీకి షాక్‌…అత‌ని చేతుల మీదుగా ట్రోఫీ అందుకోనున్న టీమిండియా

WI Vs NEP : ప్రమాదంలో వెస్టిండీస్.. టీ20 సిరీస్ గెలిచిన పసికూన నేపాల్..83 కే ఆలౌట్ చేసి మ‌రి

Women World Cup 2025: నేటి నుంచి మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్.. భార‌త్-శ్రీలంక మ‌ధ్య తొలి మ్యాచ్.. ఫ్రీ గా ఎలా చూడాలంటే..?

Big Stories

×