BigTV English

India vs Pakistan T20 Match: తీవ్ర ఒత్తిడిలో పాకిస్తాన్.. భారత్‌కు పోటీ ఇస్తుందా?

India vs Pakistan T20 Match: తీవ్ర ఒత్తిడిలో పాకిస్తాన్.. భారత్‌కు పోటీ ఇస్తుందా?

India vs Pakistan T20 Match: టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా మరికొన్ని గంటల్లో కీలక మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. దాయాది జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇటు అభిమానులతోపాటు మైదానంలోకి అడుగుపెట్టే ఆటగాళ్లకు సైతం ఒత్తిడి ఉంటుంది. అంతకుముందు ఆసియా కప్‌లో తలపడిన ఈ ఇరు జట్లు.. ఆదివారం మరోసారి ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నాయి.


పాక్‌ను వేధిస్తున్న ఓటమి..

క్రికెట్ ప్రపంచంలో అగ్రశ్రేణి జట్లలో పాకిస్తాన్ ఒక్కటి. 2022 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు.. పసికూన జట్టుపై ఓడింది. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసింది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత మ్యాచ్ టై అయింది. తర్వాత ఆడిన సూపర్ ఓవర్‌లో ఓడిపోవడంతో పాకిస్థాన్ ఒత్తిడిలో పడింది. దీంతో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ సొంత నిర్ణయాలు తీసుకోవడంతో తోటి ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నారని, బాబర్ ఏకపక్ష నిర్ణయాలే ఈ ఓటమికి కారణమని మాజీ కెప్టెన్లు తీవ్రంగా విమర్శించారు. ఈ విధంగా పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో జూన్ 9న భారత్‌తో తలపడనుంది.


Also Read: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ ?

భారత్‌ను ఢీకొడుతుందా?

భారత్ జట్టు ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. మళ్లీ ఇదే స్టేడియంలో పాకిస్తాన్‌తో భారత్ ఆడనుంది. ఇక్కడి పిచ్‌పై భారత్ బౌలర్లకు ఓ అంచనా వచ్చింది. గత మ్యాచ్‌లో అర్షదీప్ ఆరంభంలోనే రెండు వికెట్లు తీశాడు. ఈ పిచ్ బౌలర్లకు సరిపోయే వికెట్. దీనిపై భారత్ ఫాస్ట్ బౌలర్లు సరిగ్గా ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఈ పిచ్‌పై భారత బౌలర్లకు ఆడిన అనుభవం ఉంది. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతోపాటు ఇద్దరు పేస్ ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నారు. అయితే పాకిస్తాన్‌కు పిచ్‌పై ఆడిన అనుభవం లేకపోవడంతో ఆందోళనకు గురవుతోంది. ముఖ్యంగా బౌన్స్.. బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది. అంతకుముందు ఐర్లాండ్‌తో ఆడిన అనుభవం భారత్‌కు ఉండడంతో మార్చకునే అవకాశం ఉంటుంది. కానీ పాకిస్తాన్‌కు అనుభవం లేకపోవడంతో ఇబ్బంది పడొచ్చు. ఈ మ్యాచ్‌లో ప్రతి ఆటగాడు తనవంతు సహకారం అందిస్తేనే భారత్‌కు పోటీ ఉండనుంది.

Related News

IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్.. ఫ్రీ లైవ్ ఎక్కడ చూడాలంటే..ఇక‌పై డీడీ స్పోర్ట్స్‌లోనూ?

IND Vs PAK : అర్శ్‌దీప్ సింగ్ పై బ్యాన్‌…స‌రికొత్త కుట్ర‌ల‌కు తెగించిన‌ పాకిస్థాన్..!

IPL 2026: ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. షాక్ లో ప్లేయర్లు… ఇకపై అక్కడ ఒక మ్యాచ్ ఆడాల్సిందే

IND Vs PAK : టీమిండియాతో ఫైన‌ల్‌..ఓపెన‌ర్ గా షాహీన్ అఫ్రిదీ..పాక్ అదిరిపోయే ప్లాన్‌

IND VS PAK Final: ఇండియాను వ‌ణికిస్తున్న పాత రికార్డులు..అదే జ‌రిగితే పాకిస్థాన్ ఛాంపియ‌న్ కావ‌డం పక్కా ?

IND Vs PAK : నోరు జారిన షోయబ్ అక్తర్.. అభిషేక్ బచ్చన్ ను సీన్ లోకి లాగి

IND VS PAK, Final: ట్రోఫీ ఇవ్వ‌నున్న‌ నఖ్వీ.. వాడిస్తే మేం తీసుకోబోమంటున్న టీమిండియా..!

IND Vs PAK : ‘షేక్ హ్యాండ్’ వివాదం పై పాకిస్తాన్ కెప్టెన్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Big Stories

×