India vs Zimbabwe 1st T20I match(Latest sports news telugu): జింబాబ్వేతో టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. కుర్రాళ్లతో నిండిపోయిన టీమిండియా..ఐదు సిరీస్‌లో భాగంగా నేడు తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. హరారే వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ను దక్కించుకునేందు ఇరు జట్లు కసరత్తు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా జింబాబ్వే చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ ముమ్మరంగా చేశారు.
టీమిండియా కుర్రాళ్ల జట్టు.. శుభమన్ గిల్ నాయకత్వంలో బరిలో దిగనుంది. టీ20 ప్రపంచ కప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లు విరాట్, రోహిత్ శర్మ, జడేజా రిటైర్మెంట్ ప్రకటించగా…ఈ మెగా టోర్నీలో ఆడిన మిగతా ఆటగాళ్లకు సైతం బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. దీంతో అంతకుముందు జరిగిన ఐపీఎల్ లీగ్‌లో సత్తా చాటిన కుర్రాళ్లకు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో టీమిండియా చోటు దక్కించుకున్న కుర్రాళ్లు.. తామేంటో నిరూపించుకునేందుకు ఇదే మంచి అవకాశంగా శ్రమిస్తున్నారు. మరి ఈ టోర్నీలో ఎంతమంది యువ ఆటగాళ్లు రాణిస్తారో చూడాలి.
టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఈ సిరీస్‌లో నాయకత్వంతో జట్టును నడిపించనున్నాడు. గిల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, రింకు సింగ్ లాంటి కుర్రాళ్లు తమదైన ముద్ర వేయనున్నారు. అలాగే జింబాబ్వే జట్టు సైతం సికిందర్ రజా నాయత్వంలో టాలెంటెడ్ ఆటగాళ్లతో ఎదురుదాడి చేయనుంది.
టీ20 భారత జట్టుకు ముందుగా హార్దిక్ పాండ్యా రేసులో ఉండగా.. చివరికి సెలక్టర్లు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా పరిగణించారు. గిల్ బ్యాటర్ గానూ జట్టును నడిపించాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఏ ఆటగాడు..జింబాబ్వే సిరీస్‌లో లేడు. దీంతో జట్టులోని 15 మంది సభ్యులకు ఆడే అవకాశం దక్కనుంది. ఐపీఎల్ లీగ్‌లో రాణించిన అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్‌లకు మంచి అవకాశం. ఈ సిరీస్‌లో కుర్రాళ్లు సత్తా చాటితే తర్వాతి సిరీస్‌లో సెలక్టర్లు టీంలోకి తీసుకునేందుకు పరిగణించే అవకాశం ఉంది.
తుది జట్లు(అంచనా)..
భారత్:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, జితేశ్ శర్మ, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్.
జింబాబ్వే:
సికిందర్ రజా(కెప్టెన్), ఇనోసెంట్ కైయా, జొనాథన్ క్యాంప్‌బెట్, మరుమాని, షుంబా, మద్వీర, జాంగ్వి, మసకద్జా, ముజరబాని, ఎంగరవ, చటార.