BigTV English
Advertisement

ICC Women’s World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు.. PM నుంచి CM వరకు అభినందనలు

ICC Women’s World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు.. PM నుంచి CM వరకు అభినందనలు

ICC Women’s World Cup 2025: కల నిజమైంది.. మహిళ క్రికెటర్లు చరిత్ర తిరగరాశారు. మొత్తానికి టీమిండియా మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. ముంబైలో జరిగిన ఫైనల్‌లో సమిష్టి ప్రదర్శన తో అదరగొట్టిన భారత్.. ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను చిత్తు చేసి తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. సఫారీలను 52 పరుగులతో ఓడించింది. 2005, 2017 ఫైనల్స్‌లో చేజారిన కలను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సాకారం చేసింది.


ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన జట్టుకు కళ్లుచెదిరే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా షెఫాలీ మెరుపు బ్యాటింగ్‌తో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇక దీప్తి శర్మ ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది. టీమిండియా బౌలింగ్‌లోనూ మ్యాజిక్ చేసింది. కీలక సమయంలో అమాన్‌జోత్ కౌర్ మెరుపు ఫీల్డింగ్‌తో బ్రిట్స్‌ను రనౌట్ చేసింది. అద్భుతమైన స్పిన్ మాయా జాలంతో షెఫాలీ దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది.

87 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. 58 పరుగులు చేసి ఐదు వికెట్లు పడ గొట్టిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుంది. ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన చేసిన అద్భుత ప్రదర్శనతో.. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మహిళల క్రికెట్ జట్టుకు సినీ రాజకీయ ప్రముఖులు విషెస్ తెలిపారు.


చెప్పాలంటే.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం గాలివాటం కాదని అమ్మాయిలు చాటిచెప్పారు. తమది సిసలైన ఛాంపియన్ జట్టని రుజువుచేస్తూ.. హర్మన్ ప్రీత్ సేన ఒక్కసారిగా జూలు విదిల్చింది. భారతీయులంతా తమ వెంటే నిలవగా.. మునుపెన్నడూ లేనన్ని ఆశలు, అంచనాల నడుమ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో అడుగు పెట్టిన టీమిండియా సమష్టిగా ఆడి కలల కప్పును ఒడిసిపట్టింది.

భారత మహిళల జట్టుకు ప్రధాని మోడీ అభినందనలు
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్‌లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో భారత క్రీడాకారిణుల ప్రదర్శన అత్యుత్తమ నైపుణ్యం, గొప్ప ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని ఆయన కొనియాడారు. టోర్నమెంట్ ఆద్యంతం మన జట్టు అసాధారణమైన టీమ్‌వర్క్, పట్టుదలను ప్రదర్శించిందని మెచ్చుకున్నారు.

భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసిందని శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్‌లో చారిత్రక విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరితమైన తుది పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచి, ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత క్రీడాకారిణులు ప్రదర్శించిన మొక్కవోని పట్టుదల, ధైర్యసాహసాలు, అంకితభావం ప్రశంసనీయమని కొనియాడారు. జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వ పటిమను, ఫైనల్‌లో జట్టు కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

భారత మహిళల జట్టుది చారిత్రాత్మక విజయం-చంద్రబాబు
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని, ఈ విజయం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టు విజేతగా నిలవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జట్టుకు అభినందనలు తెలియజేశారు. మన అమ్మాయిలు దేశం మొత్తం గర్వపడేలా చేశారని ప్రశంసించారు.

ప్రపంచ ఛాంపియన్‌గా టీమిండియాకు – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మహిళలు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిందని టీమిండియాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీమ్ లోని ప్రతి క్రీడాకారిణి అద్భుత ప్రదర్శన చేసిందని ప్రశంసలు తెలిపారు. అంతేకాకుండా 140 కోట్ల మంది భారతీయులు గర్వపడే విజయం దక్కిందని చెప్పారు. ముఖ్యంగా షఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆటను ప్రత్యేకంగా అభినందించిన పవన్ కళ్యాణ్.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ప్రతి నెల జాబ్ మేళాలు..

టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్..
వరల్డ్ ఛాంపియన్ టీమిండియాకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. షెఫాలి వర్మ అద్భుతమైన ప్రదర్శన, దీప్తి శర్మ ఆల్ రౌండ్ ప్రతిభకు ప్రత్యేక సెల్యూట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీ చరణి పేరు గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో ఆమె గొప్ప శిఖరాలకు చేరుకుంటుందని తెలిపారు. ఈ విజయం ఒక తరానికి స్పూర్తినిస్తుంది.. జైహింద్ అని ట్విట్ చేశారు.

Related News

Pratika Rawal: వీల్ చైర్ పైనే టైటిల్ అందుకున్న ప్రతీకా రావల్..గుండెలు పిండే ఫోటోలు వైర‌ల్‌

Smriti Mandhana: ప్రియుడి కౌగిలిలో స్మృతి మందాన‌… దారుణంగా ఆడుకుంటున్న ఫ్యాన్స్ ?

Hardik Pandya: ఛాంపియ‌న్ గా టీమిండియా.. ముంబై వీధుల్లో గంతులు వేసిన హ‌ర్ధిక్ పాండ్యా

Womens World Cup 2025: 1983లో క‌పిల్, 2024లో సూర్య.. ఇప్పుడు అమన్‌జోత్..ఈ 3 క్యాచ్ లు టీమిండియా రాత మార్చేశాయి

Rohit – Nita Ambani: నీతా అంబానీ చాటింగ్‌..సీక్రెట్ గా తొంగిచూసిన రోహిత్ శ‌ర్మ‌..వీడియో వైర‌ల్‌

Womens World Cup 2025: క‌న్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ‌, ప‌డుకుని జెమిమా సెల్ఫీ, BCCI భారీ నజరానా

Ind vs SA, Final: వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 ఛాంపియ‌న్ గా టీమిండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే, రూ.100 కోట్ల‌కు పైగానే ?

Big Stories

×