Rohit – Nita Ambani: వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరిగిన నేపథ్యంలో చాలా మంది టీమిండియా మాజీ క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. రోహిత్ శర్మ ఫ్యామిలీతో పాటు నీతా అంబానీ కూడా మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు. టీమిండియా గెలిచిన ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నీతా అంబానీ మొబైల్ లో ఎవరితో చాటింగ్ చేస్తున్న నేపథ్యంలో… పక్కనే కూర్చున్న రోహిత్ శర్మ తొంగి తొంగి చూశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India Women vs South Africa Women, Final) మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా రోహిత్ శర్మ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నీతా అంబానీ పక్కనే రోహిత్ శర్మ ఫ్యామిలీ కూర్చుంది. అయితే మ్యాచ్ చూసుకుంటూ ఉండగానే, ఎవరితో దీనంగా నీతా అంబానీ చాటింగ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే రోహిత్ శర్మ ( Rohit Sharma) ఆమె ఫోన్ చూశారు.
నీతా మేడం ఎవరితో చాటింగ్ చేస్తున్నారు..? ఆమె ఎందుకు అంతలా సీరియస్ గా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే నీతా అంబానీ ( Nita Ambani) మొబైల్ తొంగి తొంగి చూశాడు. ఈ సంఘటన వైరల్ గా మారింది. ఇక నీతా అంబానీ చాటింగ్ లిస్ట్ చూసిన రోహిత్ శర్మ వీడియో కావడంతో, నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. రోహిత్ శర్మ నువ్వు అలా చూడకకూడదు, పక్క వాళ్ల ఫోన్లు చూడటం అతిపెద్ద నేరమే అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పక్కన నీ భార్య ఉన్న కూడా అలా చూశావంటే, నిజంగా నువ్వు గ్రేట్ అంటున్నారు.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్న ఫైనల్ మ్యాచ్ జరగగా.. మనోళ్లు గెలిచారు. దీంతో మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ అందుకుంది టీం ఇండియా. అయితే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత గ్రౌండ్ లోనే ఉన్న రోహిత్ శర్మ కాస్త ఎమోషనల్ అయ్యారు. 2023 సంవత్సరంలో నేను వరల్డ్ కప్ మిస్ అయ్యాను.. కానీ ఇప్పుడు మహిళల టీమిండియా అందుకుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.
Also Read: Kane Williamson Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ మామ..ఇక అతని శకం ముగిసింది
?igsh=dDllZWhleTE3OHF0
What’s my blud Rohit seeing in Nita's phone so seriously? 😭
pic.twitter.com/ITlxCWZFcs— mutual.stark (@mutualstark) November 2, 2025