Womens World Cup 2025: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) విజేతగా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేసి ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. ఎవరు ఊహించలేని విధంగా దక్షిణాఫ్రికా జట్టును కట్టడి చేసి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన క్షణంలో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. స్టేడియంలో మ్యాచ్ చూసిన వాళ్లు కూడా ఎగిరికి అంతేశారు. టీమిండియా ప్లేయర్ల ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ టీమిండియా జట్టు గెలిచిన నేపథ్యంలో మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) ఎమోషనల్ అయ్యారు. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించారు రోహిత్ శర్మ. తన భార్యతో కలిసి స్టేడియం కి వచ్చిన రోహిత్ శర్మ, మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఇక మనోళ్లు టైటిల్ గెలవగానే రోహిత్ శర్మ ఎగిరి గంతేశారు. కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు. ఆనందభాష్పాలు కూడా రాలాయి. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో నేను మిస్ అయ్యాను, కానీ ఇప్పుడు మహిళల జట్టు మాత్రం వరల్డ్ కప్ గెలిచిందనే ఫీలింగ్ రోహిత్ శర్మలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ (ICC Womens World Cup 2025 ) గెలిచిన టీమ్ ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) భారీ నజరానా ప్రకటించింది. ఛాంపియన్గా నిలిచిన భారత జట్టుకు 51 కోట్లు అందజేయనున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్వయంగా వెల్లడించడం జరిగింది. టీమిండియా అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ మధుర క్షణాన్ని అందరూ ఆస్వాదించాలని కోరారు. ఇలాంటి విజయాలు ఎన్నో టీమిండియా సాధించాలని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఇది ఇలా ఉండగా, టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India Women vs South Africa Women, Final) మధ్య ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ ( Harman preet kaur) టీం అద్భతంగా రాణించింది. ఈ తరుణంలో 52 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.
Also Read: Kane Williamson Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ మామ..ఇక అతని శకం ముగిసింది
मुंबईचा राजा is in the house supporting our girls! 🇮🇳#AaliRe #CWC25 #INDvSA | Rohit Sharma pic.twitter.com/njK7uZGjWn
— Mumbai Indians (@mipaltan) November 2, 2025
THE JEMIMAH SELFIE 😍 pic.twitter.com/mVPOtewTvp
— Johns. (@CricCrazyJohns) November 2, 2025