BigTV English

IPL-2023: క్రికెట్ అభిమానులకు పండుగే.. పండుగ.. IPL-2023 షెడ్యూల్ రిలీజ్

IPL-2023: క్రికెట్ అభిమానులకు పండుగే.. పండుగ.. IPL-2023 షెడ్యూల్ రిలీజ్

IPL-2023: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ వచ్చేసింది. బీసీసీఐ ఐపీఎల్ -2023 షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. మార్చి 31 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 52 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. మొదటి రోజు గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పడనున్నాయి. అలాగే ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక మే 28న టైటిల్ పోరు జరగనుంది.


మొత్తం ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొంటుండగా.. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ –Aలో ముంబై ఇండియ‌న్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్ – Bలో.. చెన్నై సూప‌ర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైట‌న్స్ జట్లు ఉన్నాయి. ఈసారి 10 జట్లు 70 లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.

ఇక హైదరాబాద్ వేదికగా మొత్తం 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 2న సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 24న సన్‌నైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.


Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×