E-Paper
Advertisement

దారిన పోయే ప్ర‌తి అడ్డ‌మైన వాడికి టీమిండియాలో ఛాన్స్ ఇస్తున్నారు

దారిన పోయే ప్ర‌తి అడ్డ‌మైన వాడికి టీమిండియాలో ఛాన్స్ ఇస్తున్నారు
Advertisement

Irfan Pathan On Team India: టీమిండియా జట్టు ప్రస్తుతం విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇండియాలో జరిగే ప్రతి మ్యాచ్ గెలుస్తున్న టీమిండియా… విదేశాల్లో మాత్రం బొక్క బోర్లా పడుతోంది. మొన్న ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో ఇదే జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు అలవాటైన టీమిండియా క్రికెటర్లు… బౌన్సీ మైదానాలు వస్తే మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. ఇక టెస్టుల్లో అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్నారు.

దీనంతటికీ కారణం అనుభవం లేని ప్లేయర్లతో టోర్నమెంట్ లకు వెళ్లడం. గౌతమ్ గంభీర్ అలాగే అజిత్ అగర్కర్ వచ్చిన తర్వాత అనామక ప్లేయర్లు టీమిండియాలోకి వస్తున్నారు. చాలా మంది క్రికెటర్లు వీళ్ళ హయాంలోనే తమ డెబ్యూ చేశారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) సంచలన వ్యాఖ్యలు చేశారు. దారిన పోయే ప్రతి అడ్డమైన వాడికి టీమిండియాలో ఛాన్స్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియాలో కొత్త‌గా వ‌స్తోన్న‌ ప్లేయ‌ర్ల పేరు కూడా స‌రిగ్గా తెలియ‌డం లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

Also Read: Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

దారిన పోయే ప్ర‌తి అడ్డ‌మైన వాడికి టీమిండియాలో ఛాన్స్ ఇస్తున్నారు

టీమిండియా జట్టులోకి కొత్తగా వస్తున్న ప్లేయర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇర్ఫాన్ పఠాన్. గౌతమ్ గంభీర్ అలాగే అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాత… టీమిండియాలోకి అనామక ప్లేయర్లు వస్తున్నారని బాంబు పేల్చారు. ఎవరిని పడితే వాళ్లను జట్టులోకి తీసుకొని.. జాతీయ జట్టు పరువు తీస్తున్నారని ఫైరయ్యారు. అసలు టీమిండియాలోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారో? అస్సలు అర్థం కావడం లేదని విమర్శలు చేశారు. టీమిండియా స్ట్రక్చర్ గురించి కేవలం గౌతమ్ గంభీర్ తో పాటు అజిత్ అగార్క‌ర్ కు మాత్రమే తెలుసని బాంబు పేల్చారు. ఏ ప్రతిపాదికన సెలక్షన్ జరుగుతుందో అర్థం కావడం లేదని కూడా సీరియస్ అయ్యారు. దేశవాళీ, రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న క్రికెటర్లను పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు.

అకీబ్ నబీ లాంటి వాళ్ల‌ను ఎందుకు తీసుకోవ‌డం లేదు ?

Advertisement

ముఖ్యంగా అకీబ్ నబీ లాంటి భయంకరమైన బౌలర్ ను జాతీయ జట్టులోకి తీసుకోకపోవడంపై మండిపడ్డారు ఇర్ఫాన్ ప‌ఠాన్‌. టీమిండియా కు అవసరమైన ప్లేయర్లను కాకుండా… చెత్త ఆటగాళ్లను తీసుకొని… టీమిండియాను నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది క్రికెటర్లు ప్రతి మ్యాచ్ లో ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్ లాంటి డేంజర్ బౌలర్లకు అవకాశాలు మాత్రం రావడం లేదని ఫైర్ అయ్యారు. వాళ్ల కెరీర్ చివరి దశలో ఉందని.. ఇలా చేస్తే రిటైర్మెంట్ తీసుకుంటారని హెచ్చరించారు. గౌతమ్ గంభీర్, అజిత్ అగార్క‌ర్ ఇలాగే వ్యవహరిస్తే 2027 వరల్డ్ కప్ గెలవడం కష్టమైనని వార్నింగ్ ఇచ్చారు.

Also Read: Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

Related News

దున్న‌పోతుల్లా తిన‌డం కాదు, పాకిస్తాన్ జెండా ఎగుర‌వేయ‌డం నేర్చుకో ?

ప్రియురాలితో తిరుమ‌ల‌లో మెరిసిన‌ హ‌ర్ధిక్ పాండ్యా…న‌యా లుక్ అదుర్స్‌

కామన్‌వెల్త్‌లో భార‌త్ దూకుడు..మ‌రో రెండు గోల్డ్ మెడ‌ల్స్‌

పాకిస్తాన్ ను ఓడించేందుకు వెస్టిండీస్ కుట్రలు.. వైట్ వాష్ చేసేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌

వాడికి బౌలింగ్ చేయ‌డం కంటే, రిటైర్మెంట్ ఇవ్వ‌డం బెట‌ర్‌

మీరు ఎంత గింజుకున్నా తీసుకునేది లేదు…30 ఏళ్లు దాటిన ప్లేయ‌ర్లు మాకొద్దు

ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

Big Stories

Advertisement
×