E-Paper
Advertisement

8 గంటలు నిద్రపోయినా అలసటగా అనిపిస్తోందా? మీ శరీరంలో ఈ 4 పోషకాల లోపమే కారణం

8 గంటలు నిద్రపోయినా అలసటగా అనిపిస్తోందా? మీ శరీరంలో ఈ 4 పోషకాల లోపమే కారణం
Advertisement

Fatigue Nutrition Deficiency| ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు 6 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. అయితే 8 గంటలు నిద్రపోయినా కొంతమందికి ఉదయం లేచిన తరువాత అలసటగా అనిపిస్తూ ఉంటుంది. రోజంతా శక్తి లేకపోవడం, పనిపై దృష్టి పెట్టలేకపోవడం కూడా కనిపిస్తుంది.

పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్ బాత్రా ప్రకారం.. ఈ సమస్యకు కొన్ని పోషకాల లోపం కూడా ఒక కారణం కావచ్చు. శరీరానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేయడానికి, కణజాలాన్ని మరమ్మతు చేయడానికి కొన్ని ముఖ్యమైన పోషకాలు అవసరం.

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

Advertisement

ఎప్పుడూ అలసటగా ఉండటం, ఉదయం లేవగానే నీరసంగా అనిపించడం, మధ్యాహ్నంవేళ మెదడు మందగించడం, శరీరంలో బలహీనత కనిపించడం వంటి లక్షణాలు పోషకాల లోపాన్ని సూచించవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలను కొంతవరకు తగ్గించుకోవచ్చు.

బి విటమిన్లు శక్తిని పెంచుతాయి

బి విటమిన్లు మనం తినే కార్బోహైడ్రేట్లు, కొవ్వును శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి తక్కువగా ఉంటే శరీరానికి సరైన శక్తి అందదు. పెరుగు, ఆవు పాలు, పనీర్, వేరుశెనగలలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చడం మంచిది.

ప్రోటీన్ శరీరానికి బలాన్నిస్తుంది

Advertisement

ప్రోటీన్ కండరాలు బలంగా ఉంచుతుంది. శరీరంలోని అనేక ముఖ్యమైన పనులకు కూడా ఇది అవసరం. ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే కండరాలు బలహీనపడతాయి. అలాగే తరచుగా తీపి పదార్థాలు తినాలనే కోరిక కూడా పెరుగుతుంది. ఉడికించిన మొలకలు, వేయించిన శనగలు, మసూర్ పప్పు వంటి ఆహారాలు మంచి ప్రోటీన్‌ అందిస్తాయి.

ఎలక్ట్రోలైట్లు అలసట తగ్గిస్తాయి

ఎలక్ట్రోలైట్లు శరీరంలో న్యూట్రిషన్ లిక్విడ్స్ సమతుల్యతను కాపాడుతాయి. ఇవి నరాలు, కండరాలు సరిగా పనిచేయడానికి కూడా అవసరం. స్వల్ప డీహైడ్రేషన్ కూడా అలసటకు కారణమవుతుంది. పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు శరీరంలో నీటి సమతుల్యతను నిలబెడతాయి. కొబ్బరి నీరు, అరటిపండ్లు, ఖర్బూజ, నిమ్మరసం మంచి సహజ ఎలక్ట్రోలైట్ వనరులు.

మంచి నిద్రకు మెగ్నీషియం అవసరం

మెగ్నీషియం కండరాలను సడలించి నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది గాఢమైన నిద్రకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా రాత్రి సమయంలో కండరాలు త్వరగా కోలుకునేలా చేస్తుంది. గుమ్మడికాయ గింజలు, రాజగిరా, బాదం, జీడిపప్పులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది.

రోజువారీ ఆహారంలో ఏం తినాలి?

ప్రతి రోజు ఒక కప్పు పెరుగు లేదా 100 గ్రాముల పనీర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్ కోసం ఒక కప్పు ఉడికించిన మొలకలు లేదా ఒక కప్పు వేయించిన శనగలు తినవచ్చు. వ్యాయామం తర్వాత ఒక గ్లాస్ కొబ్బరి నీరు లేదా ఒక అరటిపండు తినడం మంచిది. అలాగే ఒక టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజలు లేదా రాజగిరా, సజ్జలతో చేసిన ఆహారం తీసుకోవచ్చు.

Also Read: మళ్లీ మళ్లీ తప్పులు చేసే వారిని ఎప్పుడు క్షమించాలి? ఎప్పుడు శిక్షించాలి? చాణక్యుడి సూచనలివే

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

సరైన ఆహారం తీసుకుంటున్నా, తగినంత నిద్రపోతున్నా అలసట తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. పరీక్షల ద్వారా అసలు కారణాన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం అవసరం.

గమనిక: ఈ సమాచారం పాఠకుల ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల సలహా ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా నిపుణులైన వైద్యులను సంప్రదించండి.

Tags

Related News

న్యూమరాలజీ.. రామ, రావణులది ఒకటే జన్మ సంఖ్య.. ఇద్దరి జీవిత కర్మలు వేరు ఎందుకు?

ప్రపంచం మొత్తం దూరమైనా.. చివరి వరకు నిలిచే నిజమైన బంధమే ‘స్నేహం’!

రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? బరువు పెరగడానికి ఇదే కారణం.. ఎలాగంటే

మీ జీవిత భాగస్వామికి నాలుగు లక్షణాలు తప్పదు, జీవితాంతం పశ్చాత్తాపం తప్పదా? చాణక్యుడి సలహాలు

బాయ్ ఫ్రెండ్ అద్దెకు లభించును.. కొత్త ట్రెండ్ బాస్.. గంటకు రెంట్ ఎంతంటే?

సిగరెట్ అలవాటు లేకున్నా ఊపిరితిత్తుల క్యాన్సర్.. ప్రతి ఇంట్లో ఉండే క్యాన్సర్ కారకాలు ఇవే

మళ్లీ మళ్లీ తప్పులు చేసే వారిని ఎప్పుడు క్షమించాలి? ఎప్పుడు శిక్షించాలి? చాణక్యుడి సూచనలివే

Big Stories

Advertisement
×