E-Paper
Advertisement

ఈశ్వర్ సాయి మాధురి వివాదం.. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఈశ్వర్ సాయి వైఫ్ శరణ్య!

ఈశ్వర్ సాయి మాధురి వివాదం.. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఈశ్వర్ సాయి వైఫ్ శరణ్య!
Advertisement

Eswar Sai Wife Sharanya: ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి(Eswar Sai) గత కొద్దిరోజులుగాn లైంగిక వేధింపులు ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈయన మరొక ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ (Madhuri Rathod)ఈశ్వర్ సాయి పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈశ్వర్ సాయి తనని పెళ్లి చేసుకుంటారని మాయమాటలు చెప్పి మోసం చేశారు అంటూ ఈమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఈశ్వర్ సాయిని అరెస్టు చేయలేదు. ఈశ్వర్ సాయిని అరెస్టు చేయడానికి వీలు లేదంటూ కోర్టు కూడా ఉత్తర్వులను జారీ చేసింది.

వైరల్ అవుతున్న శరణ్య వాయిస్ మెసేజ్..

ఈ విధంగా ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వివాదం రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఈ వివాదం కారణంగా మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి చేసిన మోసాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు గత కొద్దిరోజుల క్రితం సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే తన కుటుంబ సభ్యులు ఇది గమనించి ఆమెను కాపాడగలిగారు అయితే తాజాగా ఈశ్వర్ సాయి భార్య శరణ్య(Sharanya) సైతం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా శరణ్యకు సంబంధించి ఒక వాయిస్ రికార్డర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

నా కొడుకును జాగ్రత్తగా చూసుకోండి…

Advertisement

ఈ వాయిస్ రికార్డర్ లో భాగంగా శరణ్య మాట్లాడుతూ..నేను ఈ పోరాటంలో పూర్తిగా మోసపోయాను.. నా భర్త ఈశ్వర్ సాయి లేకపోతే తాను బ్రతకలేనని నా జీవితాన్ని పూర్తిగా ఆగమాగం చేశారని శరణ్య ఎమోషనల్ అయ్యారు. అందుకే నాకు మరో మార్గం కనిపించలేదు.. ఆత్మహత్య ఒకటే మార్గంగా కనిపిస్తుందని ఈమె తెలిపారు. ఈ ద్రోహాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను దయచేసి నా కొడుకును అందరూ జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఈమె వాయిస్ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈమె ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే తనని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ప్రస్తుతం హాస్పిటల్లో శరణ్య చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తుంది.ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. ఇలా మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి మధ్య నెలకొన్న వివాదం కారణంగా శరణ్య ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. మరి ఈ వ్యవహారం ఇంకా ఇలాంటి మలుపులు తిరుగుతుందో తెలియాల్సి ఉంది. ఇక తన భార్య శరణ్య ఆత్మహత్యకు ప్రయత్నించడం పట్ల ఈశ్వర్ సాయి రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది. ఇక మాధురి రాథోడ్ ఈశ్వరి సాయి ఓకే గదిలో ఉన్న విషయం తెలుసుకున్న శరణ్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అప్పటినుంచి వీరి వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతుందని చెప్పాలి.

Also Read: అఫీషియల్ యశ్ టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

Related News

హీటెక్కించిన కెప్టెన్సీ రేస్.. భయం పుట్టిస్తున్న ఆటలు!

అభిమానులకు పండు మాస్టర్ రిక్వెస్ట్.. ప్లీజ్ ఆ పని చేయండంటూ!

బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి మాట ఎలా రికార్డ్ అవుతుందో తెలుసా?

ఆ స్వేచ్ఛ ఇప్పుడు లేదు.. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

రైతుబిడ్డ ఝాన్సీ పై ట్రోల్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తల్లి!

తల్లి కాబోతున్న సీరియల్ నటి లావణ్య.. ఘనంగా సీమంతం వేడుకలు!

సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×