E-Paper
Advertisement

కైలాస పర్వతంపై అంతుచిక్కని 8 రహస్యాలు.. సైన్స్‌కే సవాల్ విసురుతున్న శివుని ఆవాసం!

కైలాస పర్వతంపై అంతుచిక్కని 8 రహస్యాలు.. సైన్స్‌కే సవాల్ విసురుతున్న శివుని ఆవాసం!
Advertisement

Mount Kailash Mysteries: టిబెట్ లోని హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న అతి పవిత్రమైన ప్రదేశం ‘మౌంట్ కైలాష్’ (కైలాస పర్వతం). ఇది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు.. వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక విశ్వాసాలు, అంతుచిక్కని రహస్యాలకు నిలయంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలను అవలీలగా అధిరోహించిన మానవుడు.. కైలాస పర్వతం దగ్గరకు వచ్చేసరికి ఇప్పటికీ వెనకడుగు వేయాల్సి వస్తోంది. ఆధునిక సైన్స్ ఎంత పురోగమించినా.. ఈ పర్వతం చుట్టూ ఉన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోతోంది. శాస్త్రవేత్తలను సైతం తలగోక్కునేలా చేస్తున్న మౌంట్ కైలాష్‌కు సంబంధించిన 8 ప్రధాన రహస్యాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. అధిరోహించలేని శిఖరం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటికే వందలాది మంది పర్వతారోహకులు అధిరోహించారు. కానీ దానికంటే తక్కువ ఎత్తు (6,638 మీటర్లు) ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటివరకూ ఎవరూ పూర్తిగా ఎక్కలేకపోయారు. ఎక్కడానికి ప్రయత్నించినా అక్కడి తీవ్రమైన వాతావరణ మార్పులు, మానసిక భ్రాంతులకు గురికావడం వల్ల చాలా మంది వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం ఇది పరమశివుని నివాసస్థలం. కాబట్టి అక్కడికి మానవమాత్రులు ప్రవేశించడం అసాధ్యమని భక్తులు నమ్ముతుంటారు.

2. త్వరగా పెరిగే వయస్సు

Advertisement

కైలాస పర్వత పరిసరాల్లోకి వెళ్లినప్పుడు శరీరంలో విచిత్రమైన మార్పులు జరుగుతున్నట్లు పర్వతారోహకులు తెలిపారు. సాధారణంగా రెండు వారాల్లో పెరిగే గోళ్లు, జుట్టు.. అక్కడ కేవలం 12 గంటల్లోనే పెరుగుతాయని ఆధారాలతో సహా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కాలం చాలా వేగంగా పరిగెడుతుందని, ఏదో తెలియని శక్తి జీవక్రియల వేగాన్ని పెంచుతుందని చాలా మంది చెబుతుంటారు. దీనికి వెనకున్న చిక్కుముడిని శాస్త్రవేత్తలు సైతం ఇప్పటివరకూ విప్పలేకపోవడం గమనార్హం.

3. ప్రపంచానికి కేంద్ర బిందువు

రష్యన్ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. మౌంట్ కైలాష్ భూమికి కేంద్ర బిందువుగా పనిచేస్తోంది. దీనినే ‘యాక్సిస్ ముండి’ (Cosmic Axis) అని పిలుస్తారు. అంటే స్వర్గానికి, భూమికి మధ్య అనుసంధాన వంతెనగా ఈ పర్వతం ఉందనేది వారి ప్రతిపాదన. ఉత్తర ధృవం, దక్షిణ ధృవాలతో పాటు ప్రపంచంలోని ప్రముఖ పురాతన కట్టడాల నుంచి కైలాసానికి ఉన్న దూరాలను లెక్కించినప్పుడు ఒకే విధమైన రేఖాగణిత నిష్పత్తులు రావడం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది.

4. సహజసిద్ధ పర్వతమా? భారీ పిరమిడా?

Advertisement

కైలాస పర్వతం నలుగు వైపులా ఒక పర్ఫెక్ట్ పిరమిడ్ ఆకారంలో, దిక్కులకు (ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర) ఖచ్చితమైన అభిముఖంగా ఉంటుంది. దీంతో ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండ కాదని పురాతన కాలంలో అత్యంత ఉన్నతమైన సాంకేతికతతో నిర్మించబడిన ఒక భారీ మానవ నిర్మిత పిరమిడ్ అయి ఉంటుందని కొంతమంది రష్యన్ శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

5. సూర్తకాంతిలో స్వస్తిక్ నీడ

సూర్యాస్తమయ సమయంలో కైలాస పర్వతంపై పడే నీడలు ఒక పవిత్రమైన ‘స్వస్తిక్’ (Swastika) ఆకారాన్ని ఏర్పరుస్తాయి. హిందూ, జైన, బౌద్ధ మతాల్లో స్వస్తిక్ అత్యంత పవిత్రమైనది. సూర్యుడి కాంతి, పర్వతపు శిల్ప శైలి కలయిక వల్ల ప్రతిరోజూ సాయంత్రం ఈ ఆకారం స్పష్టంగా కనిపించడం ఒక అద్భుతం.

6. ఓం శబ్దం

కైలాస పర్వత ప్రాంతంలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు గాలి ప్రవాహం, మంచు కరిగే శబ్దాల కలయికతో ‘ఓం’ (OM) శబ్దం ధ్వనిస్తుందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. అక్కడున్న రాక్షస్ తాల్ సరస్సు వద్ద విచిత్రమైన ధ్వనులు వస్తాయని కూడా పేర్కొన్నారు. రాత్రిళ్లు అక్కడ ఏదో తెలియని రహస్య తరంగాలు పయనిస్తున్నట్లు తాము అనుభూతి చెందినట్లు పలువురు పర్వాతరోహకులు పేర్కొన్నారు.

7. మానససరోవరం రహస్యం

కైలాస పర్వత పాదాల వద్ద ఉన్న రెండు సరస్సుల్లో ‘మానససరోవరం’ ఒకటి. రెండోది ‘రాక్షస్ తాల్’. మానససరోవరం ఎంతో ప్రశాంతంగా ఉంటూ తియ్యటి నీటితో వృత్తాకారంలో ఉంటుంది. దీని నీటిని అత్యంత పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. కానీ దానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్న రాక్షస్ తాల్ ఉప్పు నీటితో, చంద్రవంక ఆకారంలో ఉంటుంది. పక్కపక్కనే ఉన్న రెండు సరస్సుల వేర్వేరు గుణాలను కలిగి ఉండటం శాస్త్రవేత్తలకు సైతం పెద్ద పజిల్.

Also Read: దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్ స్వాధీనం!

8. దిక్సూచీలను సైతం తప్పుదారి

మరోవైపు కైలాస పర్వతం దగ్గరకు వెళ్లినప్పుడు నావిగేషన్ పరికరాలు, డిజిటల్ కాంపాస్‌లు పూర్తిగా పనిచేయడం ఆగిపోతాయి. అక్కడ ఉన్న బలమైన అయస్కాంత రేడియోధార్మిక క్షేత్రాల వల్ల దిక్సూచీ ముల్లు విపరీతంగా తిరుగుతుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటారు. పర్వతారోహకులు తమ దిశను గుర్తించలేక దారి తప్పిపోవడానికి ఇదే ప్రధాన కారణమని భావిస్తున్నారు.

Also Read: మేనల్లుడి షాక్‌తో కంటతడి పెట్టిన బొత్స.. విజయనగరంలో సైకిల్ వైపు వైసీపీ కేడర్!

Tags

Related News

హైదరాబాద్‌లోనే ఫారిన్ ఫీలింగ్.. ఇక్కడ అడుగు పెడితే 85 దేశాల అందాలు చూసేయొచ్చు!

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు‌లో తగ్గిన ప్రయాణికుల తాకిడి.. ఏకంగా 11 శాతం డౌన్, అవే కారణాలు

హైదరాబాద్ నుంచి అండమాన్ IRCTC ఫ్లైట్ టూర్.. ధర కూడా తక్కువేనండోయ్!

బడ్జెట్‌ లో ఊటీ ట్రిప్.. హైదరాబాద్ నుంచి IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ!

జస్ట్ రూ. 95 వేలకే బాలి ట్రిప్.. హైదరాబాద్ నుంచి IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ!

సింగిల్ కమాండ్ తో టికెట్ బుక్ చేసిన ఏఐ.. ఇక IRCTCలో లాగిన్ అవసరం లేదా?

తక్కువ ధరలో IRCTC కాశ్మీర్ టూర్.. ఫ్లైట్, హోటల్, ఫుడ్ అన్నీ అందులోనే!

Big Stories

Advertisement
×