Sanjiv Goenka On Vaibhav Sooryavanshi : టీమిండియా టి20 స్పెషలిస్ట్ వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఐపీఎల్ 2026 సందర్భంగా అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ… నేరుగా టీమిండియాలోకి కూడా వచ్చేసాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ అలాగే జింబాబ్వే టి20 సిరీస్ లకు కూడా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సెలెక్ట్ అయ్యాడు. ఇంగ్లాండ్ గడ్డపై విఫలమైనప్పటికీ జింబాబ్వేలో మాత్రం, ఇరగదీశాడు. అయితే అలాంటి 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై (Vaibhav Sooryavanshi ) లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఓనర్ సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టును వదిలేసి లక్నో సూపర్ జెయింట్స్ లోకి వస్తే తన ఆస్తులు రాసిస్తానంటూ ప్రకటన చేశారు. అతను వేలంలోకి రాగానే, తానే కొనుగోలు చేస్తానని వెల్లడించారు. డబ్బుల కోసం అస్సలు ఆలోచించబోనని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో వైభవ్ పై సంజీవ్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు వేలంలోకి వస్తే కొనుగోలు చేసేందుకు చాలా జట్లు సిద్ధంగా ఉన్నాయని లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే వేలంలో అతడు ఉంటే మాత్రం తాను కూడా కొనుగోలు చేస్తానని ప్రకటించారు. అలాంటి ఆటగాడిని ఇంతవరకు తాను చూడలేదని.. ఆస్తులు రాసిచ్చిన తప్పు లేదంటూ బాంబు పేల్చారు. రాజస్థాన్ రాయల్స్ అతడిని కొనుగోలు చేసి అదృష్టం చేసుకుందని వ్యాఖ్యానించారు.
తామెందుకు వైభవ్ సూర్య వంశీని కొనుగోలు చేయలేక పోయామని ఇప్పుడు బాధపడుతున్నామని తెలిపారు. ఈ బాధ తాను ఒక్కడిదే కాదని… మిగిలిన అన్ని ఫ్రాంచైజీలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఆటం బాంబు లాంటి వైభవ్ సూర్య వంశీని కేవలం ఒకటి. 10 కోట్లకే రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకున్నట్లు గుర్తు చేశారు. తాను అయితే ఆ డబ్బుకు మూడింతలు పెట్టే వాడినని తెలిపారు.
వైభవ్ లాంటి అద్భుతమైన టాలెంట్ ను రాజస్థాన్ రాయల్స్ ఓనర్ లక్ష్మీ మిట్టల్ భవిష్యత్తులో వదులుకుంటుందని తాను అస్సలు అనుకోవడం లేదన్నారు. అతడిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారని అభిప్రాయపడ్డారు సంజీవ్ గోయెంకా. ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు. ఒకవేళ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ భవిష్యత్తులో వేలంలోకి వస్తే మాత్రం తాను వదిలేది లేదన్నారు. సర్వస్వం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని సంచలన ప్రకటన చేశారు. అవసరమనుకుంటే లక్నో కెప్టెన్సీ కూడా ఇస్తానని చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో వైభవ్ పై సంజీవ్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.