Womens Asia Cup 2026: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Womens Asia Cup 2026) విజేతగా టీమిండియా నిలిచింది. అందరూ ఊహించినట్లుగానే ఫైనల్స్ లో శ్రీలంక ఉమెన్స్ టీంను చిత్తుగా ఓడించి మరి, ఎనిమిదో సారి ఛాంపియన్ అయింది. టీమిండియా ఉమెన్స్ టీం విధించిన లక్ష్యాన్ని చేదించలేక, చేతులెత్తేసిన శ్రీలంక జట్టు.. 111 పరుగులకు కుప్పకూలింది. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో 72 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా.
8వ సారి ఆసియా కప్ టైటిల్ గెలిచిన మహిళల టీమ్ ఇండియా జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సూర్య కుమార్ యాదవ్ తరహాలోనే ఆసియా కప్ టైటిల్ ( Womens Asia Cup 2026) తీసుకోకుండానే మహిళల టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet kaur) వెను దిగారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో…మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని అందుకోకుండా, రిజెక్ట్ చేశారు. మొహ్సిన్ నఖ్వీ తానే స్వయంగా ఇండియాకు పంపించాలని.. సందేశం ఇచ్చిన మహిళల టీమిండియా, ఎలాంటి ట్రోఫీ లేకుండానే ఇండియాకు బయలు దేరింది.
పాకిస్తాన్ కు చెందిన మొహ్సిన్ నఖ్వీ, ACC చైర్మన్ గా ఉన్న తరుణంలో టైటిల్ తీసుకోవడం లేదు ఇండియన్స్. 2025 ఆసియా కప్ ట్రోఫీ కూడా సూర్య కుమార్ యాదవ్ ( Surya kumar yadav) అందుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పహాల్గమ్ సంఘటన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లతో పాటు అధికారులకు షేక్ హ్యాండ్ ఇవ్వడమే టీం ఇండియా మానేసింది. ఇందులో భాగంగానే ట్రోఫీ ( Asia cup trophy) కూడా తీసుకోవడం లేదు.
ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Womens Asia Cup 2026) నేపథ్యంలో ఫైనల్స్ దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక, టీమిండియా (India Women vs Sri Lanka Women, Final) తలపడ్డాయి. అయితే ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ టీం నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది టీమిండియా. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో శ్రీలంక ఉమెన్స్ టీం 111 పరుగులకు కుప్పకూలింది. ఈ విజయంతో ఎనిమిదో సారి ఛాంపియన్ అయింది. గతంలో శ్రీలంక అలాగే బంగ్లాదేశ్ తలోసారి విజయం సాధించగా.. పాకిస్తాన్ ఒక్కసారి కూడా టైటిల్ దక్కించుకోలేకపోయింది.
🚨 Mohsin Naqvi stands firm while India refuse to accept the winners trophy from him. pic.twitter.com/a9bagfqxrC
— Ramzy 🇵🇰🇬🇧 (@Ramz_004) September 13, 2026