E-Paper
Advertisement

పాకిస్తాన్ జట్టుకు భారతీయుల దిష్టి తగిలింది..అందుకే ఓడిపోతోంది

పాకిస్తాన్ జట్టుకు భారతీయుల దిష్టి తగిలింది..అందుకే ఓడిపోతోంది
Advertisement

Tanveer Ahmed  On Pakistan Team : పాకిస్తాన్ క్రికెట్ జట్టు ( Pakistan Team) పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. పురుషులతో పాటు మహిళల జట్టు కూడా ఎక్కడ పోటీ ఇవ్వకుండా వెను దిరుగుతోంది. ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) నేపథ్యంలో సెమీఫైనల్స్ లోనే పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. ఇంగ్లాండ్ గడ్డపై పురుషుల పాకిస్తాన్ జట్టు వైట్ వాష్ అయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed  ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టుకు భారతీయుల దిష్టి తగిలింది.. అందుకే ప్రతి మ్యాచ్ లోను ఓడిపోతుందని బాంబు పేల్చారు తన్వీర్ అహ్మద్. బాబర్, ఫాతిమా సనాలపై చేతబడి చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

పాకిస్తాన్ జట్టుకు భారతీయుల దిష్టి తగిలింది..అందుకే ఓడిపోతోంది

ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మహిళ పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అటు ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన మూడు టెస్టుల్లోను ఓడిపోయి ఇంటిదారి పట్టింది పురుషుల పాకిస్తాన్ టీం. ఒక్కరోజు వ్యవధిలోనే పాకిస్తాన్ మహిళల జట్టు దారుణమైన ఓటములను చవి చూసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఇండియన్స్ టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు. బాగా ఆడుతున్నామని.. పాకిస్తాన్ ప్లేయర్ లపై చేతబడి చేశారని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా బాబర్ ఆజామ్, ఫాతిమా సనాలపై చేతబడి చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరు సరిగ్గా ఆడకూడదని.. ఇండియన్స్ కుట్రలకు తెర లేపినట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పురుషుల జట్టుతో పాటు మహిళల పాకిస్తాన్ జట్టు ఓడిపోతూ వస్తోందని స్పష్టం చేశారు. భారతీయుల కన్ను అస్సలు మంచిది కాదని.. వాళ్ల దిష్టి తగలడం వల్ల తమకు ఈ పరిస్థితి వచ్చిందని బాంబు పేల్చారు.

ఆసియా కప్ ఫైనల్స్ లో టీమిండియా ఓడిపోవాలి – తన్వీర్ అహ్మద్ 

Advertisement

ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Women’s Asia Cup 2026 Tournament ) నేపథ్యంలో శ్రీలంక చేతిలో టీమిండియా ( Team India ) మహిళల జట్టు ఓడిపోవాలని తన్వీర్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కుట్రలకు తెరలేపి ఫైనల్స్ కు చేరిందని టీమిండియా పై విమర్శలు చేశారు. ఇక ఫైనల్స్ లో శ్రీలంక గెలిచేలా పాకిస్తాన్ అభిమానులు అల్లాను ప్రార్థించాలని కోరారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తీవ్ర అన్యాయం చేసిన టీమిండియాను అస్సలు వదలకూడదని వెల్లడించారు. తమ తరఫున శ్రీలంక క్రికెటర్లు బాధ్యత తీసుకొని.. టీమిండియాను ఓడించి ఇంటికి పంపించాలని రిక్వెస్ట్ చేశారు.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

Related News

రాజస్థాన్ ను వదిలేసి LSGలోకి వచ్చేయ్.. నా ఆస్తులు రాసి ఇస్తా !

ఫిక్సింగ్ చేసి ఫైనల్స్ కు వచ్చారు..లంక చేతిలో చిత్తుగా ఓడిపోవడం పక్కా

రన్స్ చేయకపోతే..గొంతు నొక్కి చంపేస్తానని సచిన్ కు వార్నింగ్ ఇచ్చా !

అనిల్ కుంబ్లే కుక్క కంటే హీనంగా కోహ్లీ ట్రీట్ చేసాడు..!

400 మంది కొత్త ప్లేయర్లను తీసుకోని, పాకిస్తాన్ జట్టును తయారు చేయండి

40 ఏళ్ళ రోహిత్ ను తీసుకున్నప్పుడు, షమీని ఉగ్రవాదిలా ఎందుకు ట్రీట్ చూస్తున్నారు ?

కోచ్ వహాబ్ రియాజ్ తో పాకిస్తాన్ లేడీ క్రికెటర్ డేటింగ్…స్టేడియంలోనే రొమాన్స్ !

Big Stories

Advertisement
×