Mohsin Naqvi Asia Cup Theft: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) నేపథ్యంలో మళ్లీ ట్రోఫీ వివాదం తెరపైకి వచ్చింది. ఎంతో కష్టపడి ఫైనల్స్ లో గెలిచిన టీమిండియా మహిళల జట్టు.. మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీదుగా టైటిల్ తీసుకునేందుకు వెనకడుగు వేసింది. బీసీసీఐ ఆదేశాల మేరకు, ట్రోఫీని వద్దనుకొని ఇండియా ఫ్లైట్ ఎక్కేసింది. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో టీమిండియా ఉమెన్స్ టీం తప్పు ఉందని కొందరు అంటుంటే… మరికొంతమంది మొహ్సిన్ నఖ్వీని తప్పుపడుతున్నారు. వాళ్ళు తీసుకోకపోతే అక్కడే, మరో వ్యక్తితో ట్రోఫీ అందిస్తే సరిపోయేది కదా ? అంటూ మొహ్సిన్ నఖ్వీని ఉద్దేశించి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆసియా కప్ 2026 ట్రోఫీతో మొహ్సిన్ నఖ్వీ పరారైన వీడియో వైరల్ అయింది.
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ జరిగింది. ఈ ఫైనల్స్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా మహిళల జట్టు, శ్రీలంకను చిత్తుగా ఓడించి ఎనిమిదవ సారి ఛాంపియన్ అయింది. అయితే చాంపియన్ అయినా టీమిండియా మహిళలు జట్టుకు, ట్రోఫీ మాత్రం దక్కలేదు. బీసీసీఐ ఆదేశాల మేరకు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా, ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించింది ఉమెన్స్ టీం. ఇది అలుసుగా తీసుకున్న మొహ్సిన్ నఖ్వీ, తన కారులో ట్రోఫీని పెట్టుకుని పరారయ్యాడు.
కారులో పరారైన మొహ్సిన్ నఖ్వీ వెంట టీమిండియా అభిమానులు పడ్డారు. మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని లాగేసుకునే ప్రయత్నం చేశారు. కానీ హై సెక్యూరిటీ వల్ల టీమిండియా అభిమానులు అతడిని చేరుకోలేకపోయారు. అటు పాకిస్తాన్ అభిమానులు కూడా ఈ సందర్భంగా మొహ్సిన్ నఖ్వీ శుభాకాంక్షలు తెలుపుతూ కనిపించారు. ట్రోఫీ గెలవకపోయినా… దొంగిలించావు కదా? నువ్వు గ్రేట్ బాస్ అంటూ అతడిని మెచ్చుకున్నారు.. వాళ్లు మెచ్చుకున్న నేపథ్యంలోమొహ్సిన్ నఖ్వీ అందరికీ అభివాదం చేశారు. టీమిండియా అభిమానులు ఎంత గింజుకున్నా ట్రోఫీ ఇవ్వను అంటూ తెగేసి చెప్పిన నఖ్వీ, అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా ఉమెన్స్ వర్సెస్ శ్రీలంక మధ్య ఫైనల్స్ జరిగింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 183 పరుగులు చేసిన టీమిండియా.. శ్రీలంక మహిళల జట్టును కూడా కట్టడి చేసింది. ఇండియా దెబ్బకు 111 పరుగులు చేసి కుప్పకూలింది శ్రీలంక. దీంతో 72 పరుగులు తేడాతో విజయం సాధించి ఛాంపియన్ అయింది.