BigTV English

Like A One Day CM: ఒక్కరోజు సీఎంలా.. ఒకేఒక్కడిని అవుతానంటున్న షకీబ్!

Like A One Day CM: ఒక్కరోజు సీఎంలా.. ఒకేఒక్కడిని అవుతానంటున్న షకీబ్!

Like A One Day CM: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్… బంగ్లా క్రికెట్ బోర్డుపై కారాలు మిరియాలు నూరుతున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు మార్కెట్ లేదని బోర్డు వ్యాఖ్యానించడంతో… లీగ్ కోసం సరిగ్గా మార్కెటింగ్ చేయడం చేతకావడం లేదంటూ మండిపడ్డాడు. తనకు ఛాన్సిస్తే… అర్జున్ ‘ఒకేఒక్కడు’ సినిమాకు రీమేక్‌గా… శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన నాయక్ సినిమాలో… హీరో అనిల్ కపూర్ మాదిరే అంతా సెట్ చేస్తానంటున్నాడు. మీరు నాయక్ సినిమా చూడలేదా? అని బంగ్లా క్రికెట్ బోర్డు పెద్దల్ని ప్రశ్నించాడు… షకీబ్.


సమయానికి ఆటగాళ్ల డ్రాఫ్ట్‌ నిర్వహించకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇతర టీ-20 లీగ్‌ల సమయంలో బీపీఎల్ జరుగుతోందన్నాడు. తనను బీపీఎల్‌ సీఈఓ గా నియమిస్తే రెండు నుంచి మూడు నెలల్లో అన్నీ చక్కబెడతానని చెప్పాడు. నాయక్‌ సినిమాలో మాదిరి ఏదైనా చేయాలనుకుంటే ఒక్కరోజులోనే చేయొచ్చని, తాను ఆటగాళ్ల డ్రాఫ్ట్‌, వేలాన్ని సమయానికి నిర్వహించి… ఖాళీ సమయంలో బీపీఎల్‌ నిర్వహిస్తానని షకీబ్ చెప్పుకొచ్చాడు. ఆధునిక సాంకేతికత సాయంతో… ఎంత దూరమైనా నాణ్యమైన ప్రసారం అందించవచ్చని చెప్పాడు.

షకీబ్ ఆగ్రహానికి కారణం బీపీఎల్ వైఖరే. ఏడు ఫ్రాంచైజీల యజమానులను ఎంపిక చేయడానికి బీపీఎల్‌ చాలా సమయం తీసుకుంది. ఆటగాళ్ల డ్రాఫ్ట్‌ ప్రక్రియ కూడా ఆలస్యమైంది. దాంతో… బంగ్లా ఆటగాళ్లలో చాలా మంది ప్రతిభావంతుల్ని దక్షిణాఫ్రికా ఎస్‌ఏ-20, యూఏఈ ఐఎల్‌టీ-20 పెద్ద సంఖ్యలో తీసుకున్నాయి. దాంతో బీపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న వాళ్లు కూడా పూర్తి సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు తలెత్తాయి. దీనిపై షకీబ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. డ్రాఫ్ట్‌, వేలం మూడు నెలల ముందే నిర్వహించి, రెండు నెలల ముందే జట్లను ప్రకటించలేదని, జెర్సీ ఇంకా సిద్ధం కాకపోవడం దుర్భర పరిస్థితికి నిదర్శనమని షకీబ్ మండిపడ్డాడు. బీపీఎల్ కంటే ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ నయమని, వాళ్లు సమయానికి జట్లను సిద్దం చేసి… వచ్చే సీజన్‌కి ఎవరు ఎక్కడ ఆడాలో చెబుతారని… కానీ బీపీఎల్‌లో మాత్రం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని షకీబ్ ఫైరయ్యాడు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×