Inzamam-ul-Haq: టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 లో భాగంగా ఇండియాను జింబాబ్వే ఓడిస్తే, లాహోర్‌లో బిర్యానీ పంచుతా అంటూ సంచలన ప్రకటన చేశారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq). టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Men’s T20 World Cup 2026) భాగంగా టీమ్ ఇండియా రేపు కీలక మ్యాచ్ ఆడనుంది. సూపర్ 8 లో భాగంగా టీమిండియా వర్సెస్ జింబాబ్వే ( India vs Zimbabwe ) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ( MA Chidambaram Stadium, Chennai) వేదికగా జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా చాలా కసరత్తు చేస్తోంది. ఇందులో ఓడిపోతే టీమిండియా సెమీ ఫైనల్ ఆశలు గల్లంతు కావడమే కాదు, టోర్నమెంట్ నుంచి కూడా వైదొలగాల్సి వస్తుంది.
సూపర్ 8లో భాగంగా టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జింబాబ్వే చేతిలో టీమిండియా కచ్చితంగా ఓడిపోతుందని.. ఆ బాధ్యత మొత్తం సికందర్ రాజా తీసుకోవాలని కోరారు. ఒకవేళ టీమిండియాను సికందర్ రాజా ( Sikindar Raza) ఓడిస్తే.. ఆ క్రెడిట్ మొత్తం పాకిస్తాన్ దేశానికి దక్కుతుందని వెల్లడించారు. సికందర్ రాజా పాకిస్తాన్ దేశంలోనే పుట్టి పెరిగాడని.. అతడు ఏది సాధించినా తమ దేశానికి వర్తిస్తుందని పేర్కొన్నారు. అలాగే జింబాబ్వే చేతిలో ఇండియా ఓడిపోతే ఫ్రీగా బిర్యానీ పంచుతానని ప్రకటన చేశాడు ఇంజమామ్ వుల్ హక్. లాహోర్ లో పేదలకు బిర్యానీ పంచడమే కాకుండా పిల్లలకు బట్టలు కూడా ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కొంత మంది కుర్ర క్రికెటర్లకు ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇస్తానని వెల్లడించారు. జింబాబ్వే చేతిలో ఇండియా ఓడిపోతే లాహోర్ మొత్తం సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇంజమామ్ వుల్ హక్. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
గురువారం రోజున సూపర్ 8 లో భాగంగా టీమిండియా వర్సెస్ జింబాబ్వే ( India vs Zimbabwe ) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అభిషేక్ శర్మ మరోసారి ఓపెనర్ గా రానున్నాడు. రింకు సింగ్ స్థానంలో సంజు శాంసన్ వస్తాడు. అటు వాషింగ్టన్ సుందర్ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ రంగంలోకి దిగుతాడు. అటు సిరాజ్ ను తుది జట్టులో తీసుకుంటారని అంటున్నారు.
🚨 MASSIVE STATEMENT BY INZAMAM UL HAQ ON INDIA 🚨
Inzamam-ul-Haq Said 🗣️
“If Zimbabwe defeats India, it will be Pakistan’s victory because Sikandar Raza is a child of Pakistan. InshaAllah, if India loses, I will distribute clothes and food to the poor children of Lahore and… pic.twitter.com/SAsriTaezd
— lndian Sports Netwrk (@IS_Netwrk29) February 25, 2026