E-Paper
Advertisement

West Bengal: మోదీ మాస్టర్ ప్లాన్ vs మమత సెంటిమెంట్.. బెంగాల్ గడ్డపై పైచేయి ఎవరిది?

West Bengal: మోదీ మాస్టర్ ప్లాన్ vs మమత సెంటిమెంట్.. బెంగాల్ గడ్డపై పైచేయి ఎవరిది?
Advertisement

West Bengal: వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్‌లో ఇప్పుడు కొత్త రచ్చ మొదలైంది. కేరళ రాష్ట్ర పేరు మార్పు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపై ఆ స్టేట్‌ని కేరళంగా పేర్కొనే దిశగా చర్యలు మొదలయ్యాయ్. ఈ బిగ్ డెసిషన్ తర్వాత.. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే ఉన్న పొలిటికల్ హీట్ డబుల్ అయింది. వెస్ట్ బెంగాల్ పేరుని బంగ్లాగా మార్చే ప్రతిపాదన ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉండగా, కేరళకు తక్షణమే అనుమతి ఇవ్వడంపై.. సీఎం మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేరళ రాష్ట్రం పేరు అధికారికంగా మార్పు

మలయాళంలో కేరళని.. కేరళంగానే సంబోధిస్తారు. తమ భాషా స్వరూపం, సాంస్కృతిక ప్రత్యేకతని ప్రతిబింబించేలా రాజ్యాంగంలోనూ అదే పేరు చేర్చాలని కోరుతూ.. 2024 జూన్‌లో కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. దానిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం.. కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి, అది ఆమోదం పొందిన తర్వాత పేరు మార్పు అధికారికంగా అమల్లోకి రానుంది. పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే.. ఆ రాష్ట్ర పేరు మార్పు అంశం చాలాకాలంగా చర్చల్లో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌ని.. బంగ్లాగా మార్చాలన్న ప్రతిపాదనని మమతా బెనర్జీ ప్రభుత్వం 2018లోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర సంస్కృతి ఆధారంగా బంగ్లాగా మార్చాలని కోరుతూ.. అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానాలను కూడా ఆమోదించారు. సీఎం మమత కూడా తాను పశ్చిమ బెంగాల్ సీఎంని కాబట్టే.. ఢిల్లీలో చివర్లో మాట్లాడే అవకాశం వస్తోందన్నారు.

సమావేశాలపై మమతా విమర్శలు

Advertisement

బెంగాల్ పేరుని.. బంగ్లాగా మార్చేందుకు తాను చాలాసార్లు ప్రయత్నించానన్నారు సీఎం మమత. తాను ఎంత ట్రై చేసినా.. కేంద్రం బెంగాల్ రాష్ట్రానికి వ్యతిరేకం కాబట్టి, పేరు మార్చేందుకు అనుమతించడం లేదని విమర్శించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసినప్పుడల్లా.. ఈ విషయం వారి దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. వారు బెంగాలీ వ్యతిరేకులు కాబట్టే.. పేరు మార్పు ప్రతిపాదనని ఆమోదించడం లేదని తాను భావిస్తున్నట్లు తెలిపారు మమతా బెనర్జీ. వారు బెంగాల్ చిహ్నాలను, దార్శనికులను అగౌరపరుస్తారని, ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు మాత్రమే.. ఎన్నికల టైమ్‌లో బంగ్లా అనే పదాన్ని ఉపయోగిస్తారని చెప్పారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, కేరళ పేరు మార్పు ప్రతిపాదనని కేంద్రం ఆమోదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ఇలాంటి డిమాండే ఉన్న బెంగాల్‌లో.. ఇది మరింత హీట్ పుట్టించింది. కేరళలో బీజేపీ, రాష్ట్రంలోని అధికార సీపీఎంకి మధ్య పొత్తు కుదురుతున్నందున రాష్ట్రం పేరు మార్చారని మమత విమర్శించారు. బీజేపీ ఎప్పుడైతే అధికారం కోల్పోతుందో.. అప్పుడే బెంగాల్ పేరు మారుతుందన్నారు సీఎం మమతా బెనర్జీ.

కేరళకు గ్రీన్ సిగ్నల్.. బెంగాల్‌కు కాదు

భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌తో గందరగోళం కలిగించే అవకాశముందని, అప్పట్లో కేంద్ర విదేశాంగ శాఖ పశ్చిమ బెంగాల్ పేరుని బంగ్లాగా మార్చేందుకు అభ్యంతరం తెలిపింది. కానీ, కేరళ పేరు మార్పుకు ఒప్పుకున్న కేంద్రం.. తమకెందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఇదే అదనుగా.. ఆమె కేంద్రంపై ఒత్తిడి పెంచుతారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు.. మమతా బెనర్జీ పాలనలో పశ్చిమ బెంగాల్‌ని చూస్తుంటే.. గుండె తరుక్కుపోతోందని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బెంగాల్‌ని.. బంగారు బంగ్లాగా మారుస్తామని హామీ ఇస్తూ.. గత సోమవారమే బెంగాల్ ప్రజలకు మోడీ బహిరంగ లేఖ రాశారు. ఇంకొద్ది నెలల్లో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. మోడీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. 6 దశాబ్దాల బుజ్జగింపు రాజకీయాలు.. బెంగాల్‌కు కోలుకోలేని నష్టాన్ని తెచ్చిపెట్టాయన్నారు మోడీ. స్వామి వివేకానంద, రిషి అరబిందో కలలు కన్న బెంగాల్.. ఇప్పుడు ఓట్ బ్యాంకు రాజకీయాలు, హింస, అరాచకత్వంతో నిండిపోయాయన్నారు. ఈ ఏడాది ముగిసే నాటికి రాష్ట్రాన్ని వికసిత్ బెంగాల్‌గా మారుస్తామని ప్రమాణం చేద్దామన్నారు మోడీ. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మోడీ సోనార్ బంగ్లా వర్సెస్ బంగ్లా పేరు మార్పు అనేలా జరుగుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

దేశవ్యాప్తంగా హాట్ టాపిక్

Advertisement

కేరళ పేరును కేరళంగా మార్చాలన్న ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అదే సమయంలో పశ్చిమ బెంగాల్ పేరు మార్పు ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బెంగాల్ రాజకీయాల్లో ఇదొక పెను తుపానుకు దారితీసేలా కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. మమతా బెనర్జీకి రాజకీయంగా పెద్ద అస్త్రాన్ని అందించినట్లేననే డిబేట్ ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే.. పశ్చిమ బెంగాల్ పేరును మార్చాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. పేరు మార్పుకు సంబంధించి ప్రధానంగా రెండు కారణాలున్నాయ్. ఒకటి.. ఆల్ఫాబెటికల్ ఆర్డర్.. రాష్ట్రాల సమావేశాల్లో వెస్ట్ బెంగాల్ అని ఉండటం వల్ల.. డబ్ల్యూ అక్షరంతో చివర్లో అవకాశం వస్తోంది. బంగ్లా అయితే.. బి లెటర్‌తో మొదలవుతుంది కాబట్టి.. మొదటి వరుసలోకి వస్తుంది. ఇక.. రెండో రీజన్ పూర్తిగా.. బెంగాల్ అస్తిత్వానికి సంబంధించిన అంశం. పశ్చిమ బెంగాల్‌లో.. పశ్చిమ అనే పదం విభజన గాయాన్ని గుర్తు చేస్తుందని, రాష్ట్ర సంస్కృతి ఆధారంగా, బంగ్లాగా పిలిస్తేనే బాగుంటుందనేది మమతా బెనర్జీ వాదన. ఇప్పుడు.. కేరళ పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చి, బెంగాల్‌ని పక్కనపెట్టడం ద్వారా.. బెంగాలీ అస్తిత్వంపై కేంద్రం దాడి చేస్తోందనే నినాదాన్ని.. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దీదీకి రూట్ క్లియర్ అయిందనే చర్చ జరుగుతోంది.

బెంగాల్ రాజకీయంలో కొత్త మలుపు

బెంగాల్ పేరు మార్పుని కేంద్రం పెండింగ్‌లో పెట్టడమనేది.. బీజేపీకి కొంత రిస్క్‌తో కూడుకున్న విషయమే. కేరళ కోరికని మన్నించి, బెంగాల్ ప్రతిపాదనని తిరస్కరించడం రాజకీయ వివక్షగా మమత ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది, తృణమూల్ కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో.. అవుటర్స్ వర్సెస్ బెంగాలీస్ అనే స్లోగన్‌తో విజయం సాధించారు. ఇప్పుడు.. రాష్ట్రం పేరు మార్పు అంశంతో.. మళ్లీ అదే సెంటిమెంట్‌ని రగిల్చే అవకాశం ఉంది. ఈ వివాదం ఎన్నికల దాకా ఇలాగే కొనసాగితే, రాబోయే ఎన్నికల్లో బెంగాల్ పొలిటికల్ పిక్చర్ మారిపోయే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం.. బెంగాల్ పట్ల కక్ష సాధిస్తోందని ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ఏకం చేసేందుకు.. టీఎంసీ కచ్చితంగా ప్రయత్నిస్తుంది. బీజేపీ కూడా.. రాష్ట్రం పేరు మార్పు వల్ల విభజన చరిత్ర తుడిచిపెట్టుకుపోతుందని వాదించే అవకాశం ఉంది. కానీ, ఇది సామాన్య బెంగాలీ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుందనేదే బిగ్ డౌట్. భాషా సెంటిమెంట్ బలంగా ఉన్న బెంగాల్‌లో.. ఈ అంశం న్యూట్రల్ ఓటర్లను కూడా టీఎంేసీ వైపు మళ్లించే ప్రమాదం ఉందనే డిస్కషన్ జరుగుతోంది.

బెంగాల్‌ గడ్డపై పైచేయి ఎవరిది?

త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పోరాటంగా మారనున్నాయ్. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు, సర్వేల అంచనాల ప్రకారం.. బీజేపీ, టీఎంసీ మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా బెనర్జీ సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లను ఇప్పటికీ ఆకర్షిస్తున్నాయ్. గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీకి గట్టి పట్టుంది. అయితే, సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటం వల్ల కలిగే, సహజ వ్యతిరేకత ఆ పార్టీకి ప్రధాన అడ్డంకిగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీ, డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో వస్తోంది. అర్బన్ ఓటర్లు, నార్త్ బెంగాల్‌లో బీజేపీకి మంచి అవకాశాుల కనిపిస్తున్నాయి. ఇప్పటికే, బీజేపీ అగ్రనేతలు ఎన్నికల కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

బెంగాలీ సెంటిమెంట్ వర్సెస్ బీజేపీ వ్యూహం..

ఎన్నికల కమిషన్ ఈసారి బెంగాల్‌లో భారీగా కేంద్ర బలగాలను మోహరించాలని నిర్ణయించింది. ఎన్నికలు హింస లేకుండా జరిగితే, ఓటింగ్ సరళిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని నమ్ముతున్నారు. కాంగ్రెస్-లెఫ్ట్ ఫ్రంట్ అలయన్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుందనేది కూడా ఫలితాలను తారుమారు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న అంచనా ప్రకారం.. టీఎంసీకి స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు కనిపిస్తున్నా, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో.. బెంగాల్ పేరు మార్పు అంశాన్ని టీఎంసీ ఓ రాజకీయ అస్త్రంగా వాడుకునే అవకాశముంది. కేంద్రం.. కేరళ విషయంలో సానుకూలంగా స్పందించి, బెంగాల్ ప్రపోజల్‌ని పక్కనపెట్టడం వల్ల.. మమతా బెనర్జీకి రాజకీయంగా ఓ విక్టిమ్ కార్డ్ దొరికింది. రాబోయే ఎన్నికల్లో.. బెంగాలీ అస్థిత్వం చుట్టే రాజకీయం తిరిగేలా కనిపిస్తోంది. టీఎంసీ గనక ఈ బంగ్లా స్లోగన్ ఎత్తుకుంటే.. బీజేపీ దానిని ఎలా టాకిల్ చేస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: వరంగల్‌లో హరీష్ మార్క్ పాలిటిక్స్.. కారు ఇక ట్రాక్ ఎక్కినట్టేనా?

Story by: Anup, Big Tv

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×