E-Paper
Advertisement

సరికొత్త హంగులతో గోల్డెన్ చారియట్.. సౌత్ ఇండియన్ టూర్‌ కు మీరు రెడీనా?

సరికొత్త హంగులతో గోల్డెన్ చారియట్.. సౌత్ ఇండియన్ టూర్‌ కు మీరు రెడీనా?
Advertisement

Golden Chariot 2026: భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరోసారి విలాసవంతమైన రైలు ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును మరింత అప్ గ్రేడ్ చేసింది. అంతేకాదు, తాజాగా అధికారికంగా రీలాంచ్ చేసింది. సౌత్ ఇండియాలోని చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక సంపద, ప్రకృతి అందాలను ప్రత్యేకంగా చూపించే ఈ రైలు ఇప్పుడు మరింత ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చింది.  గోల్డెన్ చారియట్ రైలు గతంలోనే దేశీయ, విదేశీ పర్యాటకులతో మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత అద్భుతంగా తయారైంది. రైలు లోపల పూర్తిగా మార్చి, అంతర్జాతీయ స్థాయి లగ్జరీ అనుభూతి కలిగేలా డిజైన్ చేశారు.

అత్యాధునిక హంగులతో..

గోల్డెన్ చారియట్ లోని ప్రతి క్యాబిన్‌ లో స్మార్ట్ టీవీలు, హైస్పీడ్ వై ఫై, అత్యాధునిక ఫర్నిచర్ లాంటి సౌకర్యాలు కల్పించారు. ప్రయాణికులు జర్నీ అంతా వినోదాన్ని ఆస్వాదించేలా ప్రత్యేక ఎంటర్‌ టైన్‌ మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీని వల్ల రైలు ప్రయాణం కేవలం టూర్ కాకుండా లగ్జరీ ఎక్స్ పీరియెన్స్ ను అందించనుంది.

ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు

Advertisement

భద్రత విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రైలు మొత్తం సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణలో ఉంటుంది. ప్రతి భాగాన్ని 24 గంటలు మానిటర్ చేసే విధంగా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే అత్యాధునిక ఫైర్ అలారం వ్యవస్థలను కూడా అమర్చారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేశారు.

ఒకేసారి 80 మంది ప్రయాణించేలా..

ఈ లగ్జరీ రైలులో ఒకేసారి 80 మంది వరకు ప్రయాణించవచ్చు. మొత్తం 40 క్యాబిన్లు అందుబాటులో ఉన్నాయి. డబుల్ బెడ్, ట్విన్ బెడ్ వంటి వేర్వేరు వసతి ఎంపికలు ఉన్నాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్యాబిన్ కూడా ఏర్పాటు చేశారు. అందరికీ సౌకర్యంగా ప్రయాణించే అవకాశం కల్పించడం లక్ష్యంగా ఐఆర్‌సిటిసి ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది.

2026-27 సీజన్ కోసం మూడు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు

Advertisement

2026-27 సీజన్ కోసం మూడు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించారు. వాటిలో  ప్రైడ్ ఆఫ్ కర్ణాటక  ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆరు రోజుల ఈ యాత్ర బెంగళూరు నుంచి ప్రారంభమై మైసూరు, హంపి, గోవా వంటి ప్రదేశాలను కవర్ చేస్తుంది. రాజసంగా కనిపించే మైసూరు ప్యాలెస్‌, హంపి చారిత్రక కట్టడాలు, గోవా సముద్రతీరాలు ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆకర్షణలు.

ఆ తర్వాత జ్యూవెల్స్ ఆఫ్ సౌత్ పేరుతో మరో టూర్ కూడా అందుబాటులో ఉంది. ఈ యాత్రలో మైసూరు, మహాబలిపురం, తంజావూరు, కొచ్చిన్ వంటి చారిత్రక ప్రాంతాలను చూపిస్తారు. దక్షిణ భారతదేశపు ఆలయ సంస్కృతి, కళా వైభవం, తీరప్రాంత చరిత్రను దగ్గరగా చూసే అవకాశం ఈ టూర్‌లో ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నవారికి  గ్లింప్సెస్ ఆఫ్ కర్ణాటక అనే నాలుగు రోజుల చిన్న ప్యాకేజ్‌ను కూడా రూపొందించారు. తక్కువ సమయంలో కర్ణాటకలోని ముఖ్యమైన వారసత్వ ప్రాంతాలను చూపించేలా ఈ టూర్ ప్లాన్ చేశారు.

Read Also: మండే ఎండలతో అల్లాడుతున్నారా? కూల్ గా అలా హిమాలయాలను చుట్టేసి రండి!

Related News

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

Big Stories

Advertisement
×