E-Paper
Advertisement

ముఖం మీదే ఛీ కొట్టిన‌ మహ్మద్ యూసఫ్..త‌లదించుకున్న మొహ్సిన్ న‌ఖ్వీ

ముఖం మీదే ఛీ కొట్టిన‌ మహ్మద్ యూసఫ్..త‌లదించుకున్న మొహ్సిన్ న‌ఖ్వీ
Advertisement

Mohammad Yousuf ON PCB: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు జరుగుతున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ గెలిచే లక్ష్యంగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ క్రికెటర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పిస్తున్న PCB, హిట్టింగ్ ఆడేలా క్రికెటర్లకు అమెరికాలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. అలాగే పాడెల్ ఆడాలనే కండిషన్ కూడా పెట్టారు. ఈ క్రమంలో మహమ్మద్ యూసఫ్ కు (Mohammad Yousuf ) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పాకిస్తాన్ హెడ్ కోచ్ గా అవకాశం ఇస్తామని.. ఆ బాధ్యతలు తీసుకోవాలని PCB వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) ఇచ్చిన ఈ ఆఫర్ ను మహమ్మద్ యూసఫ్ రిజెక్ట్ చేసినట్లు కూడా వార్తలు వైరల్ అయ్యాయి.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

ముఖం మీదే ఛీ కొట్టిన‌ యూసఫ్..త‌లదించుకున్న మొహ్సిన్ న‌ఖ్వీ

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త కోచ్ కోసం చాలా రోజులుగా వెతుకుతోంది. ఈ క్రమంలోనే మహమ్మద్ యూసఫ్ కు అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనికోసం కోట్లల్లో ఆఫర్ కూడా చేసిందట. కానీ మహమ్మద్ యూసఫ్ మాత్రం… ఈ కోచ్ ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కీలుబొమ్మలాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు చెప్పింది వినడానికి తాను సిద్ధంగా లేనని మహమ్మద్ యూసఫ్ కుండ బద్దలు కొట్టి చెప్పారట. మొహ్సిన్ న‌ఖ్వీకి డబ్బా కొట్టుకుంటూ తాను ఉండలేనని… పాకిస్తాన్ జట్టు గెలిచేందుకు తాను పనిచేస్తానని వివరించారు. ఇన్ని రోజుల పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలను పొగుడుతూ, కొంత మంది కోచ్ పదవులను అనుభవించారని గుర్తు చేశారు.

దానివల్ల పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాలా సందర్భాల్లో ఓడిపోయిందని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టును గెలిపించే కోచ్ కావాలి తప్ప.. అధికారులను పొగిడేవాళ్లు అవసరం లేదన్నారు. తాను కూడా ఎవరిని పొగడ దలుచుకోలేదని… అలాంటి భజన చేసే కోచ్ పదవి తనకు వద్దని స్పష్టం చేశారట. పాకిస్తాన్ జట్టు కోసం తాను ఎంత కష్టపడ్డానో దాన్ని గుర్తించి పదవి ఇవ్వాలని కోరారు. అలాగే తనకు కోచ్ పదవి ఇస్తే పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలని… లేకపోతే అలాంటి ఉద్యోగం తనకు వద్దని ముఖం మీదే చెప్పారట. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంటే ఇన్ని రోజులు మొహ్సిన్ న‌ఖ్వీ లాంటి అధికారులను పొగిడితేనే కోచ్ పదవులు వచ్చేవని చర్చ జరుగుతోంది.

గతంలోనూ మహమ్మద్ యూసఫ్ కు ఇదే అవమానం

Advertisement

2024 సమయంలో పాకిస్తాన్ జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుడుగా మహమ్మద్ యూసఫ్ ఉన్నారు. అప్పుడు కూడా తల ఊపే సంస్కృతి ఉండేదట. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలను పొగిడితేనే.. గౌరవం దక్కేదట. ఈ క్రమంలోనే తన పదవికి అప్పట్లో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.

 

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

 

 

 

Related News

గంభీర్ హిట్ల‌ర్ నిర్ణ‌యాలు…తెగిప‌డ్డ ఐదు త‌ల‌లు, మ‌రో ప్లేయ‌ర్ మాత్ర‌మే మిగిలాడు

అడుగ‌డుగునా అవ‌మానాలే…వాళ్ల టార్చ‌ర్ భ‌రించ‌లేక‌నే అజింక్య రహానే రిటైర్మెంట్

ఐసీసీ కుట్ర‌ల వ‌ల్లే, వైభ‌వ్ కు మెరుగైన ర్యాంకింగ్స్‌..త‌న్వీర్ సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు

మ‌రోసారి ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్‌..టైమింగ్స్‌, స్ట్రీమింగ్ ఎక్క‌డంటే

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టికొట్టిన యాజ‌మాన్యం…టీమిండియాతో మ్యాచ్ ర‌ద్దు !

పాకిస్తాన్ అంటేనే చిరాకు..ఇక జ‌న్మ‌లో నా దేశంలో అడుగు పెట్ట‌ను

వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ ను ఆడించాల‌ని, గిల్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిందే

Big Stories

Advertisement
×