E-Paper
Advertisement

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. ఎవరి వ్యూహం ఫలిస్తుంది?

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. ఎవరి వ్యూహం ఫలిస్తుంది?
Advertisement

Graduate Elections: తెలంగాణలో మరో ఆసక్తికర రాజకీయం మొదలైంది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈసారి స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ మంత్రులను ఆరు నెలల ముందే రంగంలోకి దింపింది.

మంత్రులకు భాధ్యతలు..

మహబూబ్‌నగర్ – హైదరాబాద్-రంగారెడ్డి రీజియన్ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను సీనియర్ మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం బాధ్యతలను ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భుజస్కంధాలపై ఉంచింది అధిష్టానం. క్షేత్రస్థాయి నుంచి వ్యూహాత్మకంగా వెళ్లాలనే కాంగ్రెస్ ఆలోచనకు ఈ నియామకాలే నిదర్శనం.

Advertisement

Also Read: తెలంగాణకు వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

రాబోయే రోజుల్లో..

అటు బీజేపీ కూడా ఈ పోరులో వెనక్కి తగ్గడం లేదు. పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాల్లో తమ బలాన్ని చాటుకోవాలని కమలం పార్టీ పట్టుదలతో ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా ఇప్పటినుంచే గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్లాన్లు వేస్తోంది. ఆరు నెలల ముందే పార్టీల్లో మొదలైన ఈ కోలాహలం రాబోయే రోజుల్లో రాజకీయాన్ని మరింత వేడెక్కించనుంది. నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు, విద్యా రంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా సాగబోయే ఈ సమరంలో పట్టభద్రులు ఎవరి వైపు నిలుస్తారు? కాంగ్రెస్ మార్క్ వ్యూహాలు ఫలిస్తాయా?

Advertisement

Also Read: ఇది ఏపీకి దక్కిన గౌరవం అంటూ.. ట్విట్టర్‌ వేదికగా పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్..!

Related News

లంచం ఇస్తేనే పని జరుగుతుందా.. ఏపీలో అవినీతికి అడ్డులేదా..!

బొద్దింక‌ల ఎఫెక్ట్‌.. జంత‌ర్‌మంత‌ర్ ఎత్తేయ‌లేదు.. కానీ కండిష‌న్స్ అప్లై.. !

నన్ను మించిన‌ విద్యాశాఖ మంత్రి ఉన్న‌డా? పాస్ మార్కులు వేసిండ్రు.. ఇదే ప‌నితీరుకు గీటురాయి!

మియాపూర్ ఘటనతో ఉలిక్కిపడుతున్న హైదరాబాద్.. జంకుతున్న ప్రజలు!

డేంజర్ బెల్స్.. ప్రపంచ చమురు మార్గాలపై మళ్లీ యుద్ధ ప్రభావం..!

చంద్రబాబు నోట మావిగన్ మాట.. జగన్ ఐడియా‌కు స్కెచ్ ఏసారా..?

దమ్ముంటే ఒక్క రాత్రి మా ఊళ్లో నిద్రపోండి.. అధికారులకు నల్గొండ ప్రజల సవాల్!

Big Stories

Advertisement
×