BigTV English

Dhoni – Abhishek : ఖాతాదారులకు భారీ మోసం.. ధోనికి 6 కోట్లు ఇస్తున్న SBI?

Dhoni – Abhishek : ఖాతాదారులకు భారీ మోసం.. ధోనికి 6 కోట్లు ఇస్తున్న SBI?

Dhoni – Abhishek :  దేశంలో ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు అయిన ఓ ఎస్బీై బ్రాంచ్ నుంచి సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. ఓ క్లర్క్ చాలా మంది కస్టమర్ల ఖాతాల నుంచి కోట్లాది రూపాయలను తీసుకొని పరారైన ఘటన సంచలనం రేపుతోంి. ఫిక్స్ డ్ డిపాజిట్లు, క్రెడిట్ లిమిట్ ల నుంచి డబ్బు కాజేసిన ఈ మోసగాడు, బ్యాంకు కస్టమర్ల జీవితాలను ఆర్తికంగా గందరగోళంలోకి నెట్టాడు. ఈ ఘటన పంజాబ్ లోని ఫరీద్ కోట్ లోని సదీక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో చోటు చేసుకుంది. ఎం.ఎస్. దోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయినప్పటి నుంచి SBI కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నారు. ముఖ్యంగా SBI అతన్ని ప్రకటనలు, ప్రచారాల్లో కనిపించేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.


Also Read :  Priya Saroj: రింకూ సింగ్ కు కాబోయే భార్య ఢిల్లీ గడ్డపై ఎలా రెచ్చిపోయిందో చూడండి

SBI ప్రచారాల్లో ధోనీ.. 


ఇక ప్రకటనలు, ప్రచారాల్లో కనిపించినందుకు ధోనీ గణనీయమైన రుసుమును సంపాదిస్తాడు. దీంతో అదేవిధంగా SBI అభిషేక్ బచ్చన్ బంగ్లా.. గ్రౌండ్ ఫ్లోర్ ను ఆఫీస్ స్థలంగా ఉపయోగించడానికి అద్దెకు తీసుకుంటుంది. ఇది దీర్ఘకాలిక ఒప్పందం.. ప్రారంభంలో నెలవారి అద్దె చెల్లింపులు రూ.19లక్షలు.. ఇక 5 నుంచి 10 సంవత్సరాల తరువాత వరసగా రూ.23.6 లక్షలు,  రూ.29లక్షలకు పెరుగుతుంది. SBI ఖాతాదారులకు మోసం జరిగిన విషయం తెలిసిందే. అయితే ధోనీకి రూ.6కోట్లు ఇవ్వనుంది SBI. ఈ మోసం జరిగినప్పటికీ.. వారికి మాత్రం ఒప్పందం ప్రకారం.. చెల్లించాల్సిన డబ్బు చెల్లించాల్సిందే. అందుకే ధోనీకి రూ.6 కోట్లు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు చాలా మంది కస్టమర్లు కన్నీరు పెడుతున్నారు. పరమ్ జిత్ కౌర్ అనే కస్టమర్ తన భర్తతో కలిసి ఉన్న రూ.22లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతా ఖాలీ కావడంతో కన్నీరు మున్నీరు అయింది.

సమాచారం లేకుండా డబ్బు మాయం 

మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే డబ్బు మాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మరో కస్టమర్ సందీప్ సింగ్ నాలుగు ఫిక్స్ డ్ డిపాజిట్లు ఇప్పుడు కేవలం రూ.50వేలు మాత్రమే మిగిలాయని చెప్పాడు. మా కష్టార్జితం ఇలా పోతుందని ఊహించలేదని బాధను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ మోసం విలువ దాదాపు రూ.5కోట్లకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బ్యాంకు అధికారులు ఈ ఘటన పై సమీక్ష నిర్వహిస్తున్నారు. కస్టమర్ల డబ్బులు తిరిగి ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చారు. బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ సుశాంత్ అరోరా, తాను ఇటీవలే బ్రాంచ్ లో చేరానని కస్టమర్ల ఫిర్యాదులతోనే ఈ మోసం గురించి తెలిసిందని చెప్పారు. సదీక్ బ్రాంచ్ ఇన్ చార్జీ నవదీప్ భట్టి, క్లర్క్ అమిత్ ధింగ్రా పై నాలుగు ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పోలీసులు ఇక మోసం ఘటన పై విచారణ చేపడుతున్నారు. ప్రజలు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే చాలా సేఫ్ గా ఉంటుందనుకుంటే బ్యాంకుల్లో మోసం జరిగితే ఏం చేయాలని బాధపడటం గమనార్హం.

Related News

IND VS PAK Final: పాకిస్థాన్ పై ఆపరేషన్ “తిలక్”…9వ సారి ఆసియా కప్ గెలిచిన టీమిండియా

Suryakumar Yadav Catch: సూర్య కుమార్ నాటౌటా…? వివాదంగా క్యాచ్ ఔట్‌…పాకిస్థాన్ కు అంపైర్లు అమ్ముడుపోయారా?

IND Vs PAK : బుమ్రా దెబ్బకు కుప్పకూలిన పాకిస్థాన్ జెట్… బిత్తర పోయిన హరీస్ రవూఫ్.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..

IND VS PAK Final : 4 వికెట్లతో కుల్దీప్ ర‌చ్చ‌…జెట్స్ లాగా కుప్ప‌కూలిన పాక్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

IND VS PAK : సిక్సుల వ‌ర్షం కురిపించిన‌ పాక్ బ్యాట‌ర్…బుమ్రా స్ట్రాంగ్‌ వార్నింగ్‌..!

IND Vs PAK : టాస్ గెలిచిన టీమిండియా.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

BCCI : బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్… ఓజా, RP సింగ్ లకు కీలక పదవులు

IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్.. ఫ్రీ లైవ్ ఎక్కడ చూడాలంటే..ఇక‌పై డీడీ స్పోర్ట్స్‌లోనూ?

Big Stories

×