Sneezing: తుమ్మడం అపశకునంగా బావిస్తారు. కానీ కొన్ని సందర్బాలలో మాత్రం తుమ్ము చాలా శుభప్రదం అంటున్నారు పండితులు. అయితే ఆ సందర్భాలేవో తుమ్మడం వల్ల కలిగే శుభాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎప్పుడైనా ఎవరైనా పొరపాటున తుమ్మితే ఆ తుమ్మును అపశకునంగా భావిస్తారు. అయితే ఏడు సందర్భాలలో మాత్రం తుమ్మడం ఎంతో శుభసూచకంగా భావించాలట. ఆ ఏడు సందర్భాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
కూర్చునే సమయం: ఎవరైనా కూర్చునే సమయంలో తుమ్మడం శుభసూచకంగా చెప్తున్నారు పండితులు. కూర్చునే సమయంలో తుమ్మడం వల్ల ఏ పని మీదైతే కూర్చోబోతున్నారో ఆ పని సక్సెస్ అవుతుందట. గొడవలు కానీ భూమి సమస్యల సమయంలో వాటి పరిష్కారం కోసం చర్చలు జరిపేందుకు పెద్దలు కూర్చునే సమయంలో ఎవరైనా తుమ్మితే ఆ చర్చలు సక్సెస్ అవుతాయట. ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందట.
పడుకునే సమయం: ఇక పడుకునే సమయంలో కూడా తుమ్మడం శుభసూచకమేనట. నిద్రపోయే ముందు తుమ్మడం అనేది సుఖమైన నిద్రకు సంకేతంగా బావించాలట. ఇక నిద్రపోయాక పీడకలలు కూడా రావట. ఆలాగే చాలా మందికి నిద్రలో ఉండగానే సడెన్‌గా ఉలిక్కిపడి నిద్ర లేస్తుంటారు. అలాంటి వారికి కూడా ఉపశమనంగా తుమ్ము వస్తుందట.
దాన సమయం: ఎవరికైనా దానం చేసే సమయంలో కూడా తుమ్మడం చాలా మంచిది అంటున్నారు పండితులు. దానం చేసే సమయంలో తీసుకునే వ్యక్తి ఇచ్చే వ్యక్తి కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా తుమ్మితే దానం ఇచ్చే వ్యక్తికి చాలా శుభప్రదమట. అలాగే దానం పుచ్చుకునే వ్యక్తికి కూడా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు.
భోజన సమయం: ఎప్పుడైనా భోజనం చేసే సమయంలో తుమ్మడం శుభ సూచకమే అంటున్నారు పండితులు. ఇలా భోజనం చేసే సమయంలో తుమ్మడం ఆ భోజనాన్ని మరింత అమృతంలా మారుస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే భోజనం చేసే వ్యక్తి తుమ్మితే మాత్రం వెంటనే నోరు కడుక్కుని సత్యం దోషం లేదు అని చెప్పుకోవాలని సూచిస్తున్నారు.
బట్టలు తీసుకునే సమయం: ఎవరైనా కొత్త బట్టలు తీసుకుంటున్న సమయంలో తుమ్మడం చాలా శుభప్రదం అంటున్నారు పండితులు. ఇంకా పెళ్లి బట్టలు, లేదా ఏదైనా శుభకార్యాల కోసం బట్టలు తీసుకునే సమయంలో తుమ్మితే ఆయా శుభకార్యాలు నిర్విర్ఘంగా జరుగుతాయట.
వివాద సమయం: గొడవలు జరగుతున్న సమయంలో తుమ్మడం కూడా మంచిదే అంటున్నారు పండితులు. ఆ సమయంలో ఎవరైనా తుమ్మితే అక్కడ జరుగుతున్న గొడవలు ఆగిపోతాయని.. సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్తుంటారు. ఇక గొడవలు చేసే వ్యక్తులు తుమ్మితే మాత్రం ఆ గొడవలు ఇంకా పెద్దవి కావడానికి సంకేతంగా బావించాలట.
వివాహ సమయం: పెళ్లి జరుగుతున్న సమయంలో తుమ్మడం కూడా శుభసూచకమే అంటున్నారు జ్యోతిష్య పండితులు. తాళి కట్టే సమయంలో ఎవరైనా తుమ్మితే ఆ వివాహ బంధం చాలా గట్టిగా ముడిపడుతుందని చెప్తున్నారు. అలాగే వాళ్లిద్దరికి పెళ్లి చేయడం కూడా సత్యమేనన్న సంకేతంగా తుమ్మును వర్ణిస్తున్నారు పండితులు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు బాగా ఇష్ట పడతారట