66 Years Of Kamal Haasan: పార్థసారథి శ్రీనివాసన్ అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ కమల్ హాసన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా, దర్శకుడుగా, రచయితగా ఎన్నో సినిమాలు చేసి భారతీయ సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించారు కమల్ హాసన్.
1960 ఆగస్టు 12న విడుదలైన కళాతూర్ కన్నమ్మ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు కమల్ హాసన్. అక్కడితో మొదలైన ఆయన సినిమా ప్రయాణం నేటికి 66 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఒకవైపు సినిమా కళాకారుడు గానే కాకుండా మరోవైపు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. అదే స్థాయిలో కమల్ కెరియర్ లో వివాదాలు కూడా ఉన్నాయి.
వివాదాల కేంద్ర బిందువు
2000లో విడుదలైన కమల్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సినిమా హే చాలా వివాదాలకు కారణమైంది. స్వాతంత్రం తరువాత మహాత్మాగాంధీ హత్య వరకూ జరిగిన పరిణామాల నేపథ్యంలో నిర్మించిన చారిత్రక అంశాలతో కూడిన సినిమా ఇది. ఈ సినిమాలో మహాత్మా గాంధీని తక్కువ చేసి చూపారని కాంగ్రెస్ నాయకులు భావించగా, స్వాతంత్ర్యోద్యమంలో తమ పాత్రను కించపరిచారని సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపించాయి.
సందియర్ అన్న పేరుతో ఓ సినిమాను చేస్తున్నప్పుడు, పుతియ తమిళగం సంస్థ నాయకుడు కె.కృష్ణమూర్తి, ఇతర దళిత సంఘాలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశారు. తెవర్-దళిత కులస్తుల మధ్య విభేదాలు, హింసాత్మక ఘటనలు నమోదైన దృష్ట్యా తెవర్ కులస్తుల ఆభిజాత్యానికి, వారి హింసాప్రవృత్తికి ఆ పేరు ఉత్తేజం కల్పిస్తుందని దళిత నాయకులు ఆరోపించారు. అప్పట్లో ముఖ్యమంత్రి జయలలితను కమల్ హసన్ స్వయంగా కలిసి మాట్లాడి భద్రత తెచ్చుకున్నారు. అలానే సినిమా పేరును విరుమాండిగా మార్చి 2004లో చలనచిత్రాన్ని విడుదల చేశారు.
మున్నాభాయ్ ఎంబిబిఎస్ సినిమాను తమిళ్లో వసూల్ రాజా ఎంబిబిఎస్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా టైటిల్ పై ఈరోడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాలు కమల్ జీవితంలో కోకొల్లలు ఉన్నాయి. వాటన్నిటిని కమల్ టాలెంట్ కప్పి వేసిందని చెప్పాలి.
ఆట్ కమల్ హాసన్
తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఒక డైలాగ్ రాస్తాడు. ఆట్ కమల్ హాసన్ అని, ఇప్పుడున్న జనరేషన్ కు ఈ డైలాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో ఒక వ్యక్తిని పాల్చాలి అంటే ఆ స్థాయిని క్రియేట్ చేసిన వ్యక్తి కమల్ హాసన్. ఈ డైలాగ్ డెప్త్ తెలిసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపడ్డారు. ఇది రాసినది కామెడీకి అయినా కూడా దీంట్లో ఒక వ్యక్తి టాలెంట్ రేంజ్ ఏంటో చెప్పాడు తరుణ్ భాస్కర్. ఎప్పటికీ కూడా కమల్ భారతీయ సినిమాకు ప్రత్యేకమే. ఇక కమల్ నటించిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.
Also Read: Anupama Parameswaran: 7:00 కి రమ్మంటారు… 9:30 కి షాట్ తీస్తారు, అడిగితే ఆటిట్యూడ్ అంటారు