BigTV English

Akhanda 2:వెంకీ ఫైట్ సీన్ కాపీ కొట్టిన బాలయ్య.. ఇదిగో ప్రూఫ్

Akhanda 2:వెంకీ ఫైట్ సీన్ కాపీ కొట్టిన బాలయ్య.. ఇదిగో ప్రూఫ్

Akhanda 2: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య(Balayya) చిన్న వయసులోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి కూడా యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఇటీవల కాలంలో బాలకృష్ణ తన వయసుకు తగ్గ పాత్రలని ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద ప్రతి ఒక్క సినిమా కూడా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబడుతుంది. ఇక చివరిగా బాలయ్య డాకు మహారాజ్(Daku Maharaj) సినిమా ద్వారా హిట్ కొట్టగా త్వరలోనే బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 (Akhanda 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.


త్రిశూలం తిప్పుతూ..

ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర బృందం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ముఖ్యంగా బాలయ్య త్రిశూలం తిప్పుతూ శత్రువులను చంపే సన్నివేశం టీజర్ కే హైలెట్ అయ్యిందని చెప్పాలి. అయితే తాజాగా ఈ సీన్ కాపీ అంటూ వెంకటేష్ (Venkatesh)అభిమానులు బాలయ్య పై అలాగే దర్శకుడు బోయపాటి పై భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.


వెంకటేష్ సినిమా నుంచి కాపీ…

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ గతంలో నటించిన ఒక సినిమాకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో కూడా వెంకటేష్ తన మెడ చుట్టూ కర్రను గిరగిరా తిప్పుతూ శత్రువులందరినీ చితకబాదతాడు. అయితే అఖండ2 సినిమాలోని బాలయ్య త్రిశూలంతో చేసిన సీన్ అచ్చం వెంకటేష్ సినిమా సన్నివేశాన్ని పోలి ఉండడంతో వెంకటేష్ అభిమానులు ఇది కాపీ చేశారు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. మరి నిజంగానే బోయపాటి ఈ సినిమా నుంచి కాపీ చేశారా? లేకపోతే ఈ సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆఖండ 2 లో ఆ త్రిశూలం సన్నివేశాన్ని పెట్టారా? అనేది తెలియదు కానీ ఇది మాత్రం వైరల్ అవుతుంది.

ఇక వెంకటేష్ బాలకృష్ణ ఇద్దరు కూడా ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. వెంకటేష్ ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు. అలాగే బాలయ్య సినిమాలో కూడా క్యామియో రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆఖండ సినిమా మంచి సక్సెస్ కావడంతో బోయపాటి అఖండ 2 చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న రాబోతుందని ప్రకటించారు కానీ, అదే రోజున పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా(OG Movie) కూడా రాబోతున్న నేపథ్యంలో బాలయ్య వెనక్కి తగ్గుతారంటూ వార్తలు వస్తున్నాయి.

Also Read: సుకుమార్ సినిమాలో ఛాన్స్.. మిస్ చేసుకున్న మొగలిరేకులు హీరో!

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×