IND vs SL 2025: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గిల్ నాయకత్వంలో ఇంగ్లాండ్ వెళ్లిన టీమిండియా… మరో మూడు టెస్టులు ఆడితే… సిరీస్ ముగుస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో.. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కోసం… భారత క్రికెట్ నియంత్రణ మండలి అదిరిపోయే ప్లాన్ చేసింది. వచ్చే నెలలో 3 వన్డేల సిరీస్ ను నిర్వహించేందుకు బిగ్ స్కెచ్ వేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఆటను చూసి చాలా రోజులు అయింది. ఇలాంటి నేపథ్యంలో అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయింది.
కొత్త సిరీస్ కోసం ప్లాన్ చేసిన బీసీసీఐ
టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త సిరీస్ ప్లాన్ చేసింది. శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య 3 వన్డేలు అలాగే 3 t20 లు.. ఆడించేందుకు… శ్రీలంక బోర్డుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయట. అన్ని ఓకే అయితే ఆగస్టు అంటే వచ్చేనెల మధ్యలో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నమెంట్ కోసం టీమిండియా శ్రీలంక వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ.. వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. అంటే టీమిండియా వన్ డే సిరీస్ ఆడితేనే ఇద్దరు జట్టులో మెరుస్తారు. టెస్టులు అలాగే టి20 మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. కాబట్టి వన్డే సిరీస్ ఎప్పుడు జరుగుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి కోసం… ఇప్పుడు శ్రీలంకతో మూడు వన్డేలు ప్లాన్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ ఇద్దరు ప్లేయర్లు మ్యాచ్ ఆడితే కచ్చితంగా టిఆర్పి రేట్ పెరుగుతుంది. జనాలు కూడా వస్తారు. అందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
లండన్ లో కోహ్లీ, విదేశాలకు రోహిత్ శర్మ
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య గిల్ నాయకత్వంలో టెస్ట్ సిరీస్ కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ విదేశాల్లో తన భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ముగియగానే విదేశాలకు వెళ్లిపోయాడు. ఇక ఇటు విరాట్ కోహ్లీ ఫ్యామిలీ లండన్ వెళ్లిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగిన తర్వాత వెంటనే లండన్ కి వెళ్ళిపోయింది కోహ్లీ కుటుంబం. ఇప్పుడు అక్కడే తన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు కోహ్లీ.
Also Read: Virat – Anushka: కోహ్లీ, అనుష్క పై దారుణంగా ట్రోలింగ్.. ఇండియా మ్యాచ్ కు వెళ్లకుండా అక్కడికి జంప్!
🚨 INDIA Vs SRI LANKA FOR WHITE BALL SERIES IN AUGUST 🚨
– A possibility of 3 ODIs and 3 T20I for India Vs Sri Lanka in Mid August. (NewsWire). pic.twitter.com/Xy8GdqBzWL
— Tanuj (@ImTanujSingh) July 9, 2025