E-Paper
Advertisement

Phone Tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఉచ్చులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు, సిట్ ముందుకు

Phone Tapping case:  ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఉచ్చులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు, సిట్ ముందుకు
Advertisement

Phone Tapping case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కొత్తగా ఏర్పాటైన సిట్, కీలక అధికారులు, రాజకీయ నేతలపై ఫోకస్ చేసింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావుకు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఆయన సిట్ విచారణకు హాజరుకానున్నారు.

Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం

Advertisement

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగంగా జరుగుతోంది. జనవరి సెకండ్ వీక్‌లో సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వనుంది సిట్. ఈ నేపథ్యంలో ఆనాడు కీలకంగా వ్యవహరించిన అధికారులు, మాజీ అధికారులకు నోటీసులు ఇవ్వడం జరిగిపోయింది. వారి నుంచి సమాచారం సేకరించింది. దీని ఆధారంగా రాజకీయ నేతలపై దృష్టి సారించింది. 

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కి నవీన్‌రావు చేరుకున్నారు. ఆయన్ని అధికారులు విచారించనున్నారు. ఇంతకీ నవీన్‌రావుని ప్రశ్నించడం వెనుక అసలేం జరిగింది?

సిట్ ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు

ఎమ్మెల్సీ నవీన్‌రావు డివైజ్‌తో ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని విచారించనున్నారు సిట్ అధికారులు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ వారంలో పలువురు బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది సిట్. 

న్యాయస్థానం ఆదేశాలతో డీఐజీ ఇటీవల సిట్ వేశారు. హైదరాబాద్ సిటీ సజ్జనార్ నేతృత్వలో తొమ్మిది అధికారులు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి అనుమానం, ప్రమేయమున్నవారికి నోటీసులు ఇస్తున్నారు. గడిచిన రెండువారాలు ఐపీఎస్, ఐఏఎస్, మాజీ అధికారులకు నోటీసులు ఇచ్చారు. వారి నుంచి సమాచారం తీసుకున్నారు.

ALSO READ:  అధికార పార్టీకి ధీటుగా ఇకపై బీఆర్ఎస్ వంతు, పార్టీ ఆఫీసులో పీపీపై ప్రజెంటేషన్

అలాగే ఇప్పటికే జైలులో ఉన్న పలువురు అధికారులను దగ్గర పెట్టి విచారించారు. వీటి ఆధారంగా ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. రేపో మాపో బీఆర్ఎస్ అధినేతతోపాటు ఇద్దరు లేదా ముగ్గురు మాజీ మంత్రులకు నోటీసులు ఇవ్వడం ఖాయమనే ప్రచారం సైతం లేకపోలేదు.

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×