BigTV English

Netherlands Vs South Africa: కృషి ఉంటే…విజయం తథ్యం

Netherlands Vs South Africa: కృషి ఉంటే…విజయం తథ్యం

Netherlands Vs South Africa: డచ్ టీమ్ లో వైట్ పేపర్ల స్ట్రాటజీ ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?’ అని అంతా అనుకుంటూ ఉంటారు. నిజమే ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ముఖ్యంగా క్రికెట్ లో అయితే అసలేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అంతవరకు అద్భుతంగా ఆడుతున్న జట్టు క్షణాల్లో పేకమేడలా కుప్పకూలిపోతుంది. అంతా మాయాజూదంలాగే ఉంటుంది.


ప్రస్తుతం పసికూన నెదర్లాండ్ టీమ్ పై ప్రపంచ క్రీడాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారేం చేసినా నిమిషాల్లో వైరల్ గా మారిపోతోంది. అయితే దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్ లో ఏం జరిగిందంటే…డచ్ టీమ్ చేతిలో కొన్ని వైట్ పేపర్లు కనిపించాయి. అవేమిటా? అని చాలామంది ఇంటర్నెట్ అంతా వెతికేసి, అవేమిటో కనిపెట్టారు.

ఇంతకీ ఆ తెల్లపేపర్ల వెనుక కథా కమామిషు ఏమిటంటే…పెద్ద పెద్ద జట్ల తరహాలో సమయాన్ని బట్టి వ్యూహాలను అమలు చేసే డేటా అనలిస్టులు డచ్ టీమ్ లో లేరు. ఎందుకంటే క్రికెట్ బోర్డుకి ఆర్థిక కష్టాలున్నాయి. అందువల్ల డచ్ టీమ్ ప్లేయర్లు తమ ప్లాన్లను ఇలా వైట్ పేపర్ల మీద రాసుకుని గ్రౌండ్ లోకి తెచ్చుకుంటున్నారు. ఏ టైమ్ లో ఎలా ఆడాలి? ఏ బ్యాట్స్ మెన్ కి ఎలా బౌలింగ్ చేయాలి? వికెట్లు పడకపోతే అనుసరించాల్సిన వ్యూహాలేమిటి? ఇవన్నీ వారు పరీక్షకి వెళ్లే విద్యార్థుల్లా రాసుకుని తెచ్చుకుంటున్నారు. అయితే దక్షిణాఫ్రికా మీదే కాదు…ఇతర దేశాలతో ఆడినప్పుడు కూడా వీళ్లు ఆ స్ట్రాటజీని రాసుకున్నపేపర్లను తెచ్చుకున్నారు.


ఇవన్నీ చూసిన డచ్ టీమ్ కమిట్ మెంట్ ని అందరూ అభినందిస్తున్నారు. అంత సిన్సియర్ గా ఆడటం వల్లే విజయం లభ్యమైందని చెబుతున్నారు. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అనే అన్నగారి పాటను ఉదహరిస్తున్నారు. మరోవైపు నెదర్లాండ్ టీమ్ కి తగినన్ని క్రికెట్ కిట్లు కూడా లేవని ప్రచారం జరుగుతోంది. అన్నికష్టాలు పడి వారు ఎదిగిన తీరుని మెచ్చుకుంటున్నారు. అయితే అంత కష్టంలో కూడా ప్రాక్టీస్ సమయంలో తమకి సహకరించిన కుర్రాళ్లకి వీళ్లే తిరిగి షూస్, క్రికెట్ బ్యాట్లు బహుమతిగా అందించారు. ఇది కదా నిజమైన క్రీడాస్ఫూర్తి అని కొనియాడుతున్నారు.
ఏదైనా ఈరోజుల్లో నలుగురి దృష్టిలో పడాలంటే… గెలవాల్సిందే. గెలిచిన వాడే విజేత…వాడే చరిత్రలు రాస్తాడు. ఇప్పుడు టైమ్ నెదర్లాండ్ ది.. కరెక్టే కదా…!

Related News

IND VS PAK, Final: ట్రోఫీ ఇవ్వ‌నున్న‌ నఖ్వీ.. వాడిస్తే మేం తీసుకోబోమంటున్న టీమిండియా..!

IND Vs PAK : ‘షేక్ హ్యాండ్’ వివాదం పై పాకిస్తాన్ కెప్టెన్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

NEP-WI : నేపాల్ సరికొత్త చరిత్ర.. వెస్టిండీస్ జట్టుపై చారిత్రాత్మక విజయం

IND vs PAK Final: నేడు ఆసియా క‌ప్‌ ఫైన‌ల్స్‌..పాండ్యా దూరం..టెన్ష‌న్ లో టీమిండియా, టైమింగ్స్‌..ఉచితంగా ఎలా చూడాలి

Asia Cup 2025 : టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ లో గెలిచేదెవ‌రు..చిలుక జోష్యం ఇదే

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్… బీసీసీఐ సంచలన నిర్ణయం.. బాయ్ కాట్ చేస్తూ

Shahidi Afridi : ఫైనల్స్ లో షాహిన్ ఆఫ్రిది 5 వికెట్లు తీయడం పక్కా… రాసి పెట్టుకోండి.. ఇండియాకు నిద్ర లేకుండా చేస్తాం

Shoaib Akhtar : అభిషేక్ శర్మ మనిషి కాదు… వాడో జంతువు.. పాకిస్తాన్ తట్టుకోవడం కష్టమే

Big Stories

×