E-Paper
Advertisement

Rahul Gandhi : దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు : రాహుల్‌ గాంధీ

Rahul Gandhi : దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు : రాహుల్‌ గాంధీ
Advertisement

Rahul Gandhi : దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌.. కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. 2004లో కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చిందన్నారు. సాధారణంగా నష్టం కలిగించే నిర్ణయాలు ఏ పార్టీ తీసుకోదన్నారు. కాంగ్రెస్‌ మాత్రం తనకు నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిందని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించారా? రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్పుకొచ్చారు. రాజస్థాన్‌లో అందరికీ ఉచిత వైద్యం ఇస్తున్నామన్నారు. రాజస్థాన్‌లో ఉచిత వైద్యం పథకం దేశంలోనే అద్భుతంగా ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యం క్వింటాల్‌ రూ.2,500కే కొంటున్నామన్నారు. కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ తప్పకుండా నిలబెట్టుకుంటుందని రాహుల్ స్పష్టం చేశారు. ‌

Advertisement

తెలంగాణలో బీజేపీ అడ్రస్ గల్లంతైందని రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. వాటితో ఎంఐఎం కూడా జత కట్టిందని విమర్శించారు. పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మిలాఖత్‌ అయ్యాయన్నారు. కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు ఉండవని రాహుల్ అన్నారు. తనను కేంద్రం ఎన్నో రకాలుగా వేధించిందన్నారు. కానీ కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా పెట్టదన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×