BigTV English

Nicholas Pooran: అరుదైన ఘనత సాధించిన నికోలస్ పూరన్.. టీ20ల్లో వరల్డ్ రికార్డ్!

Nicholas Pooran: అరుదైన ఘనత సాధించిన నికోలస్ పూరన్.. టీ20ల్లో వరల్డ్ రికార్డ్!

Nicholas Pooran Creates History: వెస్టిండీస్ విధ్వంసర ఆటగాడు నికోలస్ పూరన్ అరుదై ఘనతను సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ (టీకేఆర్)కు ఆడుతున్న నికోలస్.. సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోస్‌తో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. సిక్సర్ల మోత మోగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 43 బంతుల్లో 6ఫోర్లు, 7 సిక్స్ లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నికోలస్ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా నైట్ రైడర్స్ టీమ్ మరో 9 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందించాడు.


ఒకే మ్యాచ్ లో 7 సిక్స్‌లు బాదిన నికోలస్ అరుదైన ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో ఒక టీ 20 క్యాలెండర్ ఇయర్‌లో 150 సిక్స్‌లు కొట్టిన తొలి ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు. ఈ సంవత్సరం నికోలస్ ఇప్పటివరకు 63 ఇన్నింగ్స్ లు ఆడి ఇప్పటికే 151 సిక్స్ లు కొట్టాడు. ఈ జాబితాలో పూరన్ తర్వాత క్రిస్ గేల్ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. 2015లో అతడు 36 ఇన్నింగ్స్ లో 134, 2012 లో 38 ఇన్నింగ్స్‌లో 121 సిక్సర్లను కొట్టాడు.

Also Read: పాకిస్తాన్ కొంప ముంచిన అత్యాశ.. రూ.200 కోట్లు లాస్..?


టీ 20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నికోలస్ పూరన్ అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది 64 ఇన్నింగ్స్ లో 2022 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో నికోలస్ అలెక్స్ హేల్స్ రికార్డును అధికమించాడు. నికోలస్ అలెక్స్ హేల్స్ 2022 లో 61 ఇన్నింగ్స్ లో 1946 పరుగులు చేశాడు. ఈ జాబితాలు అత్యధిక పరుగులు చేసిన పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ మొదటి స్థానంలో ఉన్నాడు.

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×