E-Paper
Advertisement

Borabanda: బోరబండలో విషాదం.. బస్సు చక్రాలకింద పడి విద్యార్థి మృతి

Borabanda: బోరబండలో విషాదం.. బస్సు చక్రాలకింద పడి విద్యార్థి మృతి
Advertisement

Borabanda Bus Accident: బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. నిన్న ఉదయం స్కూల్ కి వెళ్లిన శివ చరణ్ (11) సాయంత్రం సైకిల్ పై రోడ్డుమీదికి వచ్చాడు. ఆ సమయంలోనే మరో స్కూల్ కి చెందిన బస్సు అటువైపుగా రాగా.. ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కిందపడి మరణించాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

బోరబండలో ఉన్న సెయింట్ సలోమోన్స్ స్కూల్ లో శివ చరణ్ ఐదవ తరగతి చదువుతున్నాడు. స్కూల్ పూర్తయ్యాక శివచరణ్.. తన సైకిల్ పై ఎస్పీఆర్ హిల్స్ మహాత్మా నగర్ వైపు వచ్చాడు. ఆ సమయంలోనే కార్మికనగర్ నుంచి శ్రీసాయిచైతన్య పాఠశాలకు చెందిన బస్సు అటువైపు వచ్చింది.

Advertisement

Also Read: దంపతుల్ని బలిగొన్న టమోటా లోడ్ లారీ.. తెగిపడిన మొండెం

విద్యార్థులతో వెళ్తున్న బస్సు.. బ్రహ్మశంకర్ నగర్ వద్ద టర్న్ అవుతున్న శివ చరణ్ ను ఢీ కొట్టి.. ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో శివచరణ్ మీది నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివచరణ్ మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×