Team India Sponser : భారత క్రికెట్ జట్టుకు నూతన స్పాన్సర్ ఖరారు అయింది. టీమిండియా కొత్త స్పాన్సర్ గా అపోలో టైర్స్ నిలిచింది. ఇప్పటివరకు డ్రీమ్ లెవన్ టీమిండియా స్పాన్సర్ గా వ్యవహరించింది. టీమిండియా జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైర్స్ కంపెనీ వ్యవహరించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆ సంస్థ ఒక్కో మ్యాచ్ కి రూ.4.5 కోట్లు బీసీసీఐ చెల్లించనున్నట్టు తెలుస్తోంది. 121 దైపాక్షిక మ్యాచ్ లు, 21 ఐసీసీ మ్యాచ్ లకు కలిపి రూ.579 కోట్లకు స్పాన్సర్ హక్కులు దక్కించుకున్నట్టు సమాచారం. అయితే 2027 వరకు స్పాన్సర్ కు ఉండనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
Also Read : IND VS PAK : పాకిస్తాన్ అభిమానులతో ఎంజాయ్ చేస్తున్న సచిన్ అభిమాని…!
ఇప్పటివరకు డ్రీమ్ 11 టీమిండియా జెర్సీ స్పాన్సర్ గా వ్యవహరించింది. అయితే ఆన్ లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన తరువాత డ్రీమ్ 11 ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం అన్వేషణ సాగించింది. ప్రస్తుతం టీమిండియా స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ లో ఆడుతోంది. అయితే 2025 నుంచి అపోలో టైర్స్ 2027 వరకు స్పాన్సర్ షిప్ హక్కులను దక్కించుకున్నారు. ఇంతకు ముందు డ్రీమ్ 11 టీమిండియా కి స్పానర్ గా వ్యవహరించింది. ముఖ్యంగా క్రికెట్ రంగంలో స్పాన్సర్లు ఎప్పుడు తమ మనస్సు మార్చుకొని తప్పుకుంటారో తెలియని పరిస్తితి నెలకొంది. దానికి తగినట్టుగా ఖాలీగా ఉన్న స్పాన్సర్ షిప్ ను దక్కించుకునేందుకు ప్రముఖ కంపెనీలు అన్ని క్యూ కట్టాయి. అది కేవలం టీమిండియా విషయంలోనే కాదు.. ఐపీఎల్ లో కూడా అలాంటి సంఘటనలే చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఎవ్వరూ ఊహించనివిధంగా
టీమిండియా కి బై జూస్, డ్రీమ్ 11 వంటివి స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్న తరువాత తాజాగా అపోలో టైర్స్ ఒక్కో మ్యాచ్ కి 4.5 కోట్లు బీసీసీఐ చెల్లించనుంది. ద్వైపాక్షిక మ్యాచ్ లకు 3.50 కోట్లు కాగా.. ఐసీసీ, ఏసీసీ మ్యాచ్ లకు 4.5 కోట్లు చెల్లించనుంది బీసీసీఐ. మరోవైపు బీసీసీఐ ఇంతలా పెంచిందా..? అని అంతా ఆశ్చర్యపోవడం విశేషం. వాస్తవానికి టీమిండియా కి స్పాన్సర్ షిప్ చేసేందుకు రకరకాల పేర్లు వినిపించాయి. కానీ చివరికీ అపోలో టైర్స్ దక్కించుకుంది. ముఖ్యంగా టెస్లా కంపెనీ, టెక్ స్టార్టప్, టాటా గ్రూప్, రిలియన్స్, అదానీ, విమల్ పాన్ మసాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లే వినిపించాయి. కానీ ఎవ్వరూ ఊహించనివిధంగా “అపోలో టైర్స్” దక్కించుకోవడం విశేషం. వాస్తవానికి ఆసియా కప్ కంటే ముందు టీమిండియా స్పాన్సర్ షిప్ గురించి సోషల్ మీడియాలో రోజుకొక ప్రచారం జరిగేది. ఇక ఆ తరువాత బీసీసీఐ అధికారికంగా బిడ్ వేస్తున్నామని ప్రకటించింది. అయినప్పటికీ సోషల్ మీడియా టీమిండియా స్పాన్సర్ షిప్ గురించి తెగ చర్చలు జరిగాయి. ఎట్టకేలకు ఆ చర్చలన్నింటికీ తాజాగా తెరపడినట్టు అయింది.