BigTV English

OTT Movie : ఏం సినిమా గురూ… వర్షాకాలంలోనూ చెమటలు పట్టించే మసాలా సీన్లు… కాకరేపే క్రైమ్ కథ

OTT Movie : ఏం సినిమా గురూ… వర్షాకాలంలోనూ చెమటలు పట్టించే మసాలా సీన్లు… కాకరేపే క్రైమ్ కథ

OTT Movie : థియేటర్లలో సెన్సార్ ఉంటుంది కాబట్టి మంచి మసాలా స్టఫ్ ఉండే సినిమాలను చూడడం చాలా కష్టం. ఒకవేళ లిప్ లాక్ ఉంటేనే ఆ సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అంతకుమించి ఏదన్నా ఉందంటే కత్తెరకు పని చెప్తారు. కానీ ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారికి ఓటీటీలో లెక్కలేనన్ని సినిమాలు ఉన్నాయి. అందులో అన్నీ ఓపెన్ గా చూపించే సినిమాలు ఎన్నో. సింగిల్ గా చూడాల్సిన సినిమాలు మరెన్నో ఉన్నాయి. అలా ఇలాంటి సినిమాల కోసం వెతుకుతున్న వారి కోసమే ఈ మూవీ.


జీ5లో అందుబాటులో 

డెస్పాచ్ (Despatch) 2024లో విడుదలైన హిందీ క్రైమ్ డ్రామా. కాను బెహ్ల్ దర్శకత్వంలో, రానీ స్క్రూవాలా రొన్నీ స్క్రూవాలా నిర్మాణంలో తెరకెక్కింది. మనోజ్ బాజ్పేయ్ (జాయ్ బాగ్), షహానా గోస్వామి (ప్రేర్ణా), అర్చితా అగర్వాల్ (గోపీకా), రితుపర్ణా సేన్ (అభిజిత్), దినేష్ నౌదియాల్ (అశ్విన్), గౌరీ షిండే (సుమిత్రా), సచిన్ కల్ ఖేర్ (సాయ్), విర్జాస్ రతనా (అర్జున్), దేవ్ కిరన్ (రాహుల్), రాజ్ ఏండ్రూ (విక్రమ్), హర్ష్ మెహ్రా (రాహుల్), అమ్రిత్ లేఖా (నూర్) ఇందులో నటించారు. 2024లో ఈ మూవీ MAMI ముంబై ఫిల్మ్ ఫెస్టివల్, IFFI గోవాలో ప్రీమియర్ అయ్యింది. జర్నలిజం, కార్పొరేట్ కరప్షన్, IPL మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్, రివెంజ్, ఫెయిల్డ్ మ్యారేజ్ వంటి అంశాలున్న ఈ సినిమా డైరెక్ట్ గా ZEE5లో అందుబాటులోకి వచ్చింది.

కథలోకి వెళ్తే… 

సినిమా 2012లో ముంబైలో మొదలవుతుంది. డిజిటల్ మీడియా యుగంలో ప్రింట్ న్యూస్‌పేపర్ ‘డెస్పాచ్’ సర్వైవల్ క్రైసిస్‌లో ఉంటుంది. జాయ్ బాగ్ (మనోజ్ బాజ్పేయ్) అనే వెటరన్ క్రైమ్ జర్నలిస్ట్ అన్‌హ్యాపీ మ్యారేజ్, కెరీర్ స్ట్రగుల్స్‌తో బాధపడతాడు. అతను శెట్టి మర్డర్ కేస్ కవర్ చేయడానికి అసైన్ అవుతాడు. ఇది ముంబై అండర్‌వరల్డ్‌తో లింక్ అయి ఉంటుంది. జాయ్ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేస్తూ, IPL మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ (GDR గ్రూప్ – పాలిటీషన్స్, బాలీవుడ్ స్టార్స్, బిజినెస్‌మెన్, మనీ లాండరింగ్) వంటి పెద్ద స్కామ్ లను కనుగొంటాడు.


ఇదే క్రమంలో జాయ్ డెస్పాచ్‌లో కంటెంట్ ఎడిటర్ ప్రేర్ణా (అర్చితా అగర్వాల్)తో అఫైర్ మొదలు పెడతాడు. ఆమె అతన్ని డిజిటల్ జర్నలిజం వైపు పుష్ చేస్తుంది. శెట్టి మర్డర్ కేస్ ను విచారిస్తూ, జాయ్ ముంబై అండర్‌వరల్డ్‌లోకి వెళ్తాడు. అయితే అందులో భాగంగా బయటపడ్డ స్కామ్ లో పవర్‌ఫుల్ పీపుల్ (అభిజిత్ – రితుపర్ణా సేన్, అశ్విన్ – దినేష్ నౌదియాల్) ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. దీంతో ఆ ఎఫెక్ట్ జాయ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ పై పడుతుంది.ఈ నేపథ్యంలోనే అతను నూర్ (అమ్రిత్ లేఖా)తో మరో అఫైర్ మొదలుపెడతాడు. క్లైమాక్స్‌లో జాయ్ స్కామ్‌ను పబ్లిష్ చేస్తాడు. కానీ జాయ్ నే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇంతకీ పోలీసులు జాయ్ ని ఎందుకు అరెస్ట్ చేశారు? చివరి ట్విస్ట్ ఏంటి? అనేది కథ.

Read Also : బాబోయ్ అన్నీ అవే సీన్లు… కట్టుకున్న వాడు ఉండగానే… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ

Related News

OTT Movie : ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటకొస్తే బతుకు బస్టాండే… మనుషుల్ని పీక్కుతినే వైరస్ తో డేంజర్ బెల్స్

OTT Movie : మెంటల్ మాస్ ఫ్యామిలీ ఇది… తెలియక గెలికి మరీ తన్నించుకునే పక్కింటోళ్లు… కిర్రాక్ కుటుంబం మావా

OTT Movie : విమానంలోంచి ఊడి, 500 ఏళ్ల పాస్ట్ లో పడే చెఫ్… కొరియన్ ఫుడ్ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్

OTT: ఓటీటీ సినిమా థియేటర్ ను చంపేస్తోందా? అసలేం అవుతోంది?

Madharaasi: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన శివ కార్తికేయన్ మదరాసి.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movie : చిన్న క్లూ కూడా వదలకుండా చంపే కిల్లర్… గ్రిప్పింగ్ స్టోరీ ఉన్న సీట్ ఎడ్జ్ కన్నడ క్రైమ్ కథ

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… కట్టుకున్న వాడు ఉండగానే… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ

Big Stories

×