E-Paper
Advertisement

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి
Advertisement

Lalit Modi On Pakistan Cricket:  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan cricket board) నిత్యం వార్తల్లో నిలుస్తుంది అన్న సంగతి తెలిసిందే. ఏదో ఒక వివాదం బోర్డులో చోటు చేసుకుంటుంది. వివాదాస్పద నిర్ణయాలు, చర్యలకు కేరాఫ్ అడ్రస్ గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిలుస్తూ వస్తోంది. అయితే అలాంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై (PCB) లలిత్ మోడీ (Lalit Modi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతి ఉందంటూ బాంబు పేల్చాడు. వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలంటూ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొహ్సిన్ న‌ఖ్వీ (Mohsin Naqvi) డ‌బ్బుల‌ను మొత్తం పందికొక్కులాగా మేస్తున్నాడ‌ని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో లలిత్ మోడీ (Lalit Modi) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..ICC జోక్యం చేసుకోవాలి

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురించి ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అత్యంత అవినీతిమయం అయిందని బాంబు పేల్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయ జోక్యం పెరిగిందని… దానివల్ల అస్తవ్యస్తంగా తయారయిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి పలుకుబడి ఉన్నవాళ్లు మాత్రమే వస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. దీనిపై వెంటనే ఐసీసీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో అవినీతి జరుగుతోందని ఐసీసీకి తెలిసినప్పటికీ… మౌనం ఎందుకు పాటిస్తుందోనని నిలదీశారు.

వెంట‌నే మొహ్సిన్ న‌ఖ్వీపై చ‌ర్య‌లు తీసుకోవాలి

వెంటనే ఐసీసీ చర్యలకు దిగకపోతే… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ న‌ఖ్వీ.. పందికొక్కుల డబ్బులను మేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు పాకిస్తాన్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి… ఇటు క్రికెట్ బోర్డును శాసిస్తున్నాడని మండిపడ్డారు. తనకు నచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేయడం కూడా జరుగుతోందని ఆరోపణలు చేశారు. దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని… జట్టు కూడా పెద్దగా విజయాలు నమోదు చేసుకోవడం లేదని వివరించారు.

Advertisement

ముందుగా మొహ్సిన్ న‌ఖ్వీ (Mohsin Naqvi)పై చర్యలు తీసుకుంటేనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ దారిన పడుతుందని సూచనలు చేశారు లలిత్ మోడీ. దీంతో లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అవినీతితో పేరుకుపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు… భవిష్యత్తులో ఐసీసీ టోర్నమెంట్లలో రాణించడం కష్టమేనని తెలిపారు. 2027 వన్డే వరల్డ్ కప్ వస్తుంద నేపథ్యంలో మెరుగైన ఫలితాలు రాబట్టాలంటే… పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ప్రక్షాళన చేయాల్సిందేనని తెలిపారు.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

Related News

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు

సూర్య కుమార్, హర్మన్‌ప్రీత్ ఇద్దరు జంటగా వచ్చి ట్రోఫీ తీసుకోండి !

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి

ట్రోఫీ వద్దనుకున్న టీమిండియా, ఇకపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు

ఫిక్సింగ్ చేసి గెలిచారనే, టీమిండియాకు ట్రోఫీ ఇవ్వలేదు

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

Big Stories

Advertisement
×