E-Paper
Advertisement

కొడుకుపైనే అనుమానం… శవాన్ని తవ్వించి మరీ డీఎన్ఏ టెస్ట్ చేయించే తండ్రి

కొడుకుపైనే అనుమానం… శవాన్ని తవ్వించి మరీ డీఎన్ఏ టెస్ట్ చేయించే తండ్రి
Advertisement

Telugu Psychological Drama: మనిషిని బయట నుంచి శత్రువులు బాధ పెట్టకపోయినా… మనసులో పుట్టిన ఒక చిన్న అనుమానం మాత్రం జీవితాన్నే తలకిందులు చేయగలదు. ముఖ్యంగా ఆ అనుమానం కుటుంబానికి సంబంధించినదైతే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టం. అలాంటి సున్నితమైన అంశాన్ని కేంద్రంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమే ‘రావు బహదూర్’ (Rao Bahadur). కథను నెమ్మదిగా ఒక్కో లేయర్ గా ప్రజెంట్ చేస్తూ, ప్రేక్షకుడిని చివరి వరకు ఆలోచింపజేసేలా తీర్చిదిద్దారు దర్శకుడు వెంకటేష్ మహా. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకలాజికల్ డ్రామాకు థియేటర్లలో మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ఏ ఓటీటీలోకి అడుగు పెట్టింది ? అసలు స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రాజవంశానికి చెందిన రావు బహదూర్ రామప్ప జీవిత చరమాంకంలో ఉంటాడు. అంటే చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతున్న అతనికి మరణం రోజురోజుకూ దగ్గరవుతున్నా, శారీరక నొప్పి కంటే మనసులోని ఒక అనుమానమే ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. తన చిన్న కుమారుడు కుసుమప్ప నిజంగా తన సొంత కొడుకేనా ? అనే ప్రశ్న అతడిని క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు.

Advertisement

ఆ అనుమానానికి సమాధానం దొరకకపోవడంతో రామప్ప ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పటికే మరణించి సమాధి చేసిన తన కుమారుడి మృతదేహాన్ని బయటకు తీయించి డీఎన్ఏ పరీక్ష చేయించాలని పట్టుబడతాడు. ఆ ఒక్క నిర్ణయం కుటుంబంలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలకు తలుపులు తెరుస్తుంది.

డీఎన్ఏ పరీక్ష ఫలితం బయటకు వచ్చిన తర్వాత కథ పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది. కానీ అక్కడితో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు. అసలు రామప్ప మనసులో ఈ అనుమానం ఎందుకు పుట్టింది ? అతని కుటుంబంలో జరిగిన సంఘటనలు ఏమిటి ? వారసత్వం, గౌరవం, రక్త సంబంధం అనే పేరుతో మనుషులు తీసుకునే నిర్ణయాలు ఎంత ప్రమాదకరంగా మారుతాయి ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను ఓటీటీలో చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

ఒక చిన్న అనుమానం మనిషి జీవితాన్ని ఎంతగా మార్చేస్తుందో… కుటుంబ బంధాల విలువ ఎంత గొప్పదో చెప్పే చిత్రమే ‘రావు బహదూర్’. ఇది మిస్టరీ థ్రిల్లర్ మాత్రమే కాదు. మనసులో పుట్టిన సందేహం ఎంతటి బంధాన్నైనా ఎలా విచ్ఛిన్నం చేస్తుందో చెప్పే సైకలాజికల్ డ్రామా.చివర్లో వచ్చే కీలక ట్విస్ట్ హైలెట్. స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగినా, ప్రతి సన్నివేశానికి ఒక అర్థం ఉంటుంది. కమర్షియల్ యాక్షన్ కంటే కథకు, పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు చూడాలి అనుకునే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

‘రావు బహదూర్’ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. థియేటర్లలో మిస్ అయిన వారు, ఆలోచింపజేసే సైకలాజికల్ డ్రామా చూడాలనుకునే వారికి ఈ సినిమా మంచి వీకెండ్ ఛాయిస్.

Read Also: ప్రపంచంలోనే తొలి సీక్రెట్ స్పై ఏజెన్సీ ఎలా పుట్టింది ? ఈ మూవీ చూస్తే షాక్ అవుతారు

Tags

Related News

చెక్క వంతెన దాటితే చావు మూడినట్టే… క్లైమాక్స్‌తో పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ మూవీ తెలుగులో

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ మూవీస్.. ఒక్కరోజు 14 సినిమాలు స్ట్రీమింగ్..!

అంతరిక్షంలో ప్రతీకార ప్రయాణం… రెండు ఓటీటీల్లోకి డీసీ కొత్త సూపర్‌గర్ల్ మూవీ

చనిపోయే ముందు రాబిన్ హుడ్ చేసిన చివరి పని… గూస్‌బంప్స్ గ్యారెంటీ మావా

రోగి మరణం వెనుక గత జన్మల మిస్టరీ… సైకియాట్రిస్ట్‌కే మైండ్ బ్లాంకయ్యే ట్విస్ట్

ప్రాణాలు తీసిన ప్రాంక్… ఓటీటీని షేక్ చేస్తున్న షాకింగ్ టీన్ థ్రిల్లర్

అమెరికాను కుదిపేసిన రియల్ సైకో స్టోరీ… తెలుగులోనే ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×