E-Paper
Advertisement

బంగారు షాపులో కేడీ ఎలుక.. రాత్రికి రాత్రే ఉంగరాలు, గొలుసులు మాయం.. సీసీటీవీ చూస్తే..!

బంగారు షాపులో కేడీ ఎలుక.. రాత్రికి రాత్రే ఉంగరాలు, గొలుసులు మాయం.. సీసీటీవీ చూస్తే..!
Advertisement

Mouse Theft: కర్ణాటక తుమకూరు జిల్లాలోని విశ్వాస్ జ్యువెలరీ షాప్‌ (Vishwas Jewellers)లో జరిగిన చోరీ.. అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఉదయాన్నే షాపును తెరిచిన సిబ్బందికి డిస్‌ప్లేలో ఉండాల్సిన 10 బంగారు ఉంగరాలు, రెండు బంగారు గొలుసులు కనిపించలేదు. దీంతో షాప్‌లో పెద్ద ఎత్తున దొంగతనం జరిగిందని భావించిన సిబ్బంది వెంటనే యజమానికి సమాచారం అందించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన సిబ్బందికి కళ్లుబయర్లు కమ్మే దృశ్యాలు కనిపించాయి.

దొంగతనం ఎవరు చేశారంటే?

రాత్రిపుట దొంగతనం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు యజమాని, సిబ్బంది కలిసి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే అందులో కనిపించిన దృశ్యాలు చూసి.. వారికి నోట మాట రాలేదు. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఒక ఎలుక నోటితో హాయిగా బంగారు ఉంగరాన్ని పట్టుకుని వెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. దీంతో ఇదంతా చేసింది ఒక చిట్టెలుకా అని తెలిసి అందరూ ఒక్కసారిగా ఖంగు తిన్నారు. రూ.10 లక్షల విలువైన బంగారాన్ని ఎలుక తీసుకెళ్లడం చూసి ఆశ్చర్యపోయారు.

Advertisement

ఎలుకను పట్టించిన ప్రైస్ ట్యాగ్స్!

ఈ చోరీ ఘటనలో మరో విచిత్రం కూడా చోటుచేసుకుంది. సాధారణంగా దొంగలు ఆభరణాలను ఎత్తుకెళ్లేటప్పుడు ప్రైస్ ట్యాగ్స్ తో సహా తీసుకెళ్లడం చాలా అరుదు. కానీ షాపులో మాయమైన ఆభరణాలతో పాటు వాటికి ఉన్న ప్రైస్ ట్యాగ్‌లు కూడా కనిపించలేదు. ఇక్కడే షాపు యజమానికి అనుమానం వచ్చింది. ‘ఎవరైనా దొంగలు పడితే కేవలం బంగారాన్ని మాత్రమే తీసుకెళ్తారు తప్ప, ప్రైస్ ట్యాగ్‌లను తీసుకెళ్లరు కదా’ అని ఆయన ఆలోచించారు. షాపులో ఏదో వింత జరిగిందన్న అనుమానం దానివల్లే తమకు కలిగిందని యజమాని పేర్కొన్నారు. చివరికి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఎలుక ఇదంతా చేసిందని తెలిసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు.

Advertisement

Also Read: పాస్‌పోర్ట్ రంగుల అసలు రహస్యం తెలుసా? బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్ దేనికి సంకేతమంటే..!

బయటపడ్డ ‘కేడీ ఎలుక’ నిధి!

సీసీటీవీ ఆధారాలతో రంగంలోకి దిగిన షాపు సిబ్బంది.. దుకాణం మూలల్లో వెతకడం ప్రారంభించారు. అలా వెతుకుతుండగా ఓ దగ్గర షాప్‌ గోడకు ఎలుక చేసిన రంధ్రం కనిపించింది. వెంటనే అక్కడ తవ్వి చూడగా మాయమైన 10 బంగారు ఉంగరాలు, గొలుసులు, వాటి ప్రైస్ ట్యాగ్‌లు అన్నీ బయటపడ్డాయి. దీంతో జ్యువెలరీ షాపు యజమానితో పాటు.. సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఎలుకను బయటకు తరిమేసి.. కన్నాన్ని మూసే పనిలో సిబ్బంది పడినట్లు తెలుస్తోంది.

Also Read: విశాఖ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. ఎయిర్‌పోర్ట్ రేంజ్ సౌకర్యాలు.. 6 కొత్త ప్లాట్‌ఫామ్‌లు!

Tags

Related News

లీకు ముఠాను వదిలిపెట్టబోం.. పార్లమెంటులో బిల్లు ఆమోదం, ప్రధాని మోదీ మరొక వీడియో

కిలాడీ భార్య క్రైమ్ స్టోరీ.. భర్తను ఫ్యాక్టరీలో పాతేసి.. విదేశాల్లో ఉన్నాడంటూ రెండేళ్లుగా డ్రామాలు..!

ప్రభుత్వ బస్సు మాజీ డ్రైవర్‌ ఇంట్లో కోట్ల సంపద.. రూ. 29 కోట్ల క్యాష్, 15 కేజీల బంగారం

కర్ణాటక కాలేజీల్లో హెచ్‌ఐవీ బాంబ్.. 7,000 మంది విద్యార్థులకు పాజిటివ్..!

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆ నిబంధన చెల్లదు!

మరణించిన రెండేళ్లకు క్లీన్ చీటా? సుప్రీం తీర్పుపై ప్రముఖ జర్నలిస్ట్ అసహనం!

బిగ్ బ్రేకింగ్.. వందేమాతరం బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×