Big Stories

Pakisthan Beats Nederlands : ఎట్టకేలకు పాక్‌కు తొలి విజయం

T20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తొలి విజయం సాధించింది. పసికూన నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్… కనీసం ధాటిగా ఆడేందుకు కూడా ప్రయత్నించ లేదు. ఏదో మొక్కుబడికి ఆడుతున్నట్లు ఆడింది. తొలి 5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 18 రన్స్ చేసిన ఆ జట్టు… 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేయగలిగింది. దాంతో… మ్యాచ్ చూస్తున్న వాళ్లు పరమ బోరింగ్ గా ఫీలయ్యారు. ఆ తర్వాతైనా నెదర్లాండ్స్ బ్యాటర్లు ధాటిగా ఆడతారనుకుంటే… వరుసగా వికెట్లు పారేసుకున్నారు. ఆ జట్టులో ఇద్దరు మినహా అంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దాంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 91 పరుగులే చేయగలిగింది… నెదర్లాండ్స్.

- Advertisement -

92 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో ఛేజింగ్ మొదలెట్టిన… రెండో ఓవర్లోనే కెప్టెన్ బాబర్ ఆజామ్ వికెట్ కోల్పోయింది. చివరికి నెదర్లాండ్స్ పైనా దారుణంగా విఫలమయ్యాడు… బాబర్ ఆజామ్. మరో ఓపెనర్ రిజ్వాన్ మాత్రం ధాటిగా ఆడాడు. 39 బంతుల్లోనే 49 రన్స్ చేశాడు. అతనికి ఫకర్ జమాన్, షా మసూద్ అండగా నిలవడంతో… 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది పాకిస్థాన్. 6 వికెట్ల తేడాతో గెలిచింది. 3 వికెట్లు తీసిన పాక్ బౌలర్ షాదాబ్ ఖాన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News