Big Stories

KCR Passes ‘GO’ on CBI : సీబీఐ అడుగుపెట్టాలంటే మా పర్మిషన్ కావాల్సిందే : కేసీఆర్

KCR passes ‘GO’ on CBI : సీబీఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా… జీవో 51ని జారీ చేసింది. గతంలో ఏ కేసు దర్యాప్తుకైనా సీబీఐకి ఇచ్చిన అనుమతులను… KCR ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 51ని జారీచేసింది. ఇకపై రాష్ట్రంలో CBI ఏ కేసు దర్యాప్తు చేయాలన్న… అనుమతి తీసుకోవాల్సిందేనని KCR ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Advertisement -

సీబీఐను కేంద్రంలో ఉన్నవారు రాజకీయంగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. బీజేపీ యేతర రాజకీయ నాయకులపైనే ఎక్కువగా సీబీఐ రైడ్ జరిగింది. ఆపరేషన్ లోటస్‌లో భాగంగా సీబీఐతో ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ నిపుణుల అంచనా. కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ రాజకీయాలను స్టార్ట్ చేశారు. దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో సీబీఐ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించి.. తెలంగాణలో ఈ అస్త్రాన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ జీవో 51ను ప్రయోగించారని పలువురి అభిప్రాయం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News