BigTV English

Paris Paralympics 2024: నేటి నుంచి పారిస్‌ పారా ఒలింపిక్స్‌.. ఉత్సాహంగా భారత్‌

Paris Paralympics 2024: నేటి నుంచి పారిస్‌ పారా ఒలింపిక్స్‌.. ఉత్సాహంగా భారత్‌

ఇప్పటికే నదీ ప్రాంగణమంతా రంగురంగుల లైట్లతో ముస్తాబైంది.  11 రోజుల పాటు సాగనున్న మెగాటోర్నీలో 168 దేశాల నుంచి 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొననున్నారు. మొత్తం 22 క్రీడాంశాల్లో 549 పతకాల కోసం పోటీపడనున్నారు.

మన భారతదేశం నుంచి ఈసారి 84 మంది క్రీడాకారులు బయలుదేరారు. వీరు 12 విభాగాల్లో పతకాల వేట కొనసాగించనున్నారు.  టోక్యో పారాలింపిక్స్‌ (2020)లో ఐదు స్వర్ణాలతో కలిపి, మొత్తం 19 పతకాలు సాధించిన మన అథ్లెట్లు ఈసారి ఆ నెంబర్ ను పెంచాలని పట్టుదలతో ఉన్నారు.


పారాలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో సుమిత్‌ అంటిల్‌, భాగ్యశ్రీ జాదవ్‌ జాతీయ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. పారా ఒలింపిక్స్ లో చరిత్రలోనే స్టేడియంలో కాకుండా బహిరంగ ప్రదేశంలో తొలిసారి ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇకపోతే పారిస్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయో అక్కడే పారా ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి.

ఎప్పటిలాగే చైనా ఈసారి కూడా సత్తా చాటాలని చూస్తోంది. టోక్యో పారా ఒలింపిక్స్ లో 96 స్వర్ణాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈసారి అదే రీతిలో రికార్డును కాపాడుకోవాలని చూస్తోంది. ఇక వీటితో పాటు అదిరే ప్రదర్శనలు, అద్భుత విన్యాసాలు ఉండనున్నాయని అంటున్నారు.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×