BigTV English

Preity Zinta- Mahvash: చాహల్ కాపురంలో నిప్పులు పోస్తున్న ప్రీతి జింటా !

Preity Zinta- Mahvash: చాహల్ కాపురంలో నిప్పులు పోస్తున్న ప్రీతి జింటా !

Preity Zinta- Mahvash: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {​IPL} చరిత్రలో ఇప్పటివరకు టైటిల్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ జట్టు కూడా ఒకటి. కానీ ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకుంటామనే ధీమాతో టోర్నీలో ముందుకు సాగుతోంది. అలాగే పంజాబ్ కింగ్స్ జట్టులోని ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అయితే ఇటీవల చాహల్ హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మరింత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆట కంటే తన వ్యక్తిగత విషయాలతో చాహల్ మరింత ఫేమస్ అవుతున్నాడు.


Also Read : Kohli – Anushka Sharma : కోహ్లీకి అవమానం.. అనుష్క శర్మ ప్రైవేట్ పార్ట్స్ పై ట్రోలింగ్ !

ఆ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఓ అమ్మాయితో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన నెటిజెన్లు.. ఇంతకీ ఆమె ఎవరంటూ ఆరా తీస్తే.. ఆర్జె మహ్వాష్ గా గుర్తించారు. దీంతో ఆమెతో చాహల్ పీకల్లోతు డేటింగ్ లో ఉన్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ ముద్దుగుమ్మ కూడా చాహల్ ఆడే మ్యాచ్ లకు హాజరు అవుతూ.. అతడు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పుడల్లా పొగడ్తలతో ముంచేస్తుంది. ఇటీవల వీరిద్దరి గురించి ఓ ఆసక్తికర అంశం కూడా బయటికి వచ్చి చర్చనీయాంశంగా మారింది. తన ప్రియురాలితో కలిసి జీవించేందుకు చాహల్ ముంబైలోని ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ని రెంట్ కి తీసుకున్నట్లు సమాచారం.


 

ఫిబ్రవరి 4వ తేదీన ఈ అపార్ట్మెంట్ ని తీసుకున్నాడని, రెండు సంవత్సరాల పాటు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని తెలుస్తోంది. ఆ అపార్ట్మెంట్ కి రెంట్ నెలకు మూడు లక్షలు ఉంటుందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే 10 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇచ్చాడని ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా..? లేక లివింగ్ రిలేషన్ షిప్ ప్రారంభించారా..? అని క్రికెట్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ సహ యాజమాని ప్రీతి జింటా – చాహల్ ప్రియురాలు ఆర్జే మహ్వాష్ ఇద్దరూ కలిసి రాజస్థాన్లోని జైపూర్ రామ్ భాగ్ ప్యాలెస్ లో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఈ ఫోటో చూసినా క్రీడాభిమానులు ప్రీతి జింటా దగ్గరుండి మరి వీళ్ళ పెళ్లి ఫిక్స్ చేస్తుందా..? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చాహల్ – దనశ్రీ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ జంట విడాకుల బాట పట్టారు.వీరి విడాకులపై తొలుత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మొదట చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసింది. అంతకు ముందు ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త చాహల్ పేరుని తొలగించింది. దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల గురించి పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో వీరు విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే వీరు విడాకులు తీసుకున్నారు. తమ విడాకుల గురించి ఈ జంట అధికారికంగా ప్రకటించారు.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×