BigTV English

OTT Movies : మే చివరి వారంలో ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ చెయ్యకండి..

OTT Movies : మే చివరి వారంలో ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ చెయ్యకండి..

OTT Movies : థియేటర్లలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా సరే ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి.. దాంతో ఎక్కువగా ఇక్కడ వచ్చే సినిమాలకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే తమ అభిమాన హీరో సినిమా ఉందా లేదా అని మూవీ లవర్స్ ఎక్కువగా వెతికేస్తుంటారు. అలాంటి వారికి మరింత వినోదాన్ని అందించేందుకు కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. అలాగే ఈ సోమవారం నుంచి కూడా మే చివరి వరకు ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. ఆ సినిమాలు ఏంటో .. ఏ ఫ్లాట్ ఫామ్ లో చూడాలో ఒకసారి తెలుసుకుందాం..


ఈ వారం థియేటర్లలో భైరవం, షష్టిపూర్తి సినిమాలు మాత్రమే రానున్నాయి. వీటిపై పెద్దగా అంచనాల్లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం 14 మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. వీటిలో కేవలం మూడు సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాల విషయానికొస్తే.. నాని ‘హిట్ 3’, సూర్య ‘రెట్రో’ సినిమాలతో పాటు అజ్ఞాతవాసి అనే కన్నడ డబ్బింగ్ మూవీని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.. వీటితో పాటుగా వీకెండ్ లో మరికొన్ని సినిమాలు సడెన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ మూవీలు ఏంటో ఒకసారి చూసేద్దాం..

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. 


హాట్‌స్టార్..

కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) – మే 28

క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – మే 29

ఏ కంప్లీట్ అన్‌నోన్ (ఇంగ్లీష్ సినిమా) – మే 31

జీ5..

అజ్ఞాతవాసి (కన్నడ సినిమా) – మే 28

Also Read :ఎవరి దారి వాళ్లదే… భయం వేస్తుంది చూస్తే.. అల్లు అరవింద్‌పై దిల్ రాజు డైరెక్ట్ కౌంటర్..

నెట్‌ఫ్లిక్స్..

మైక్ బిర్బిగిలియా (ఇంగ్లీష్ సినిమా) – మే 26

కోల్డ్ కేస్: ద టైలీనాల్ మర్డర్స్ (డాక్యుమెంటరీ సిరీస్) – మే 26

హిట్ 3 (తెలుగు సినిమా) – మే 29

ఏ విడోస్ గేమ్ (స్పానిష్ మూవీ) – మే 30

లాస్ట్ ఇన్ స్టార్ లైట్ (కొరియన్ సినిమా) – మే 30

ద హార్ట్ నోస్ (స్పానిష్ మూవీ) – మే 30

రెట్రో (తెలుగు సినిమా) – మే 31

ఆపిల్ ప్లస్ టీవీ..

బోనో: స్టోరీస్ ఆఫ్ సరండర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 30

లులు ఇన్ రైనోసిరోస్ (ఇంగ్లీష్ సినిమా) – మే 30

సోనీ లివ్..

కంఖజురా (హిందీ సిరీస్) – మే 30

మొత్తానికి ఈవారం మూవీ లవర్స్ కి పండగ ఏం చెప్పాలి.. ఇక ప్రస్తుతానికైతే ఈ సినిమాలు డేట్ ని లాక్ చేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఇక వచ్చే నెలలో బోలెడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Tags

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×