
India vs Pakistan Asia cup today(Latest sports news telugu):
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. దాదాపు 10 నెలల తర్వాత మరోసారి ఈ హైఫీవర్ రాబోతోంది. శ్రీలంక వేదికగా ఆసియా కప్‌లో కీలక ఫైట్. మధ్యాహ్నం 3 గంటలకు దాయాదుల మ్యాచ్.
విజయంపై ఇరు జట్లు సీరియస్‌గా ఫోకస్ పెట్టాయి. బలాబలాల ఇంచుమించుగా సమానంగా అనిపించినా.. రియాల్టీలో టీమిండియానే టఫ్. బ్యాంటింగ్‌లో మనల్ని కొట్టే మొనగాళ్లు లేరు. పాకిస్తాన్ బౌలింగ్ కాస్త బలంగా ఉంటే ఉండొచ్చు. నేపాల్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజమ్, ఇఫ్తికర్ అహ్మద్‌లు సెంచరీలు బాదేసినా.. భారత్‌ను ఢీకొట్టడం అంత ఈజీ కానేకాదు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలే జట్టుకు కీలకం. విండీస్ టూర్‌లో విఫలమవడంతో హార్దిక్ పాండ్యా ఫామ్ కలవరపెడుతోంది. శుబ్‌మన్ గిల్ సైతం ఇంకా రేసులోకి రాలేదు. కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కావడంతో.. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్. అతను బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే మిడిలార్డర్‌లో ఆడతాడా?
గాయం కారణంగా ఆటకు దూరమైన శ్రేయస్ అయ్యర్ మళ్లీ బరిలో దిగనున్నాడు. టీమిండియా ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కుల్దీప్ యాదవ్ మెయిన్ స్పిన్నర్‌గా ఉంటే.. జడేజా, అక్షర్ పటేల్‌లు ఆల్‌రౌండర్ల భారం మోయనున్నారు.
పేసర్లుగా సిరాజ్, బుమ్రా, హార్దిక్ పాండ్యాలు ఉండే అవకాశం ఉంది. షమీ, శార్దుల్ ఠాకూర్, ప్రసిద్‌లు బెంచ్‌కే పరిమితం కావొచ్చు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్‌లకు పాకిస్తాన్‌తో ఫైట్ చేసే ఛాన్స్ రాకపోవచ్చు.
ఇక, ఈ హైఓల్టేజీ మ్యాచ్‌లో ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. వరుణుడు రెడీగా ఉన్నాడు. శనివారం పల్లెకెలెలో రోజంతా వర్షం కురవొచ్చనేది వెదర్ రిపోర్ట్. మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఎక్కువే అంటున్నారు. ఇదే అభిమానులను తెగ కలవర పెడుతోంది.
ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో ఇండియా, పాక్‌లు ఇప్పటి వరకు 13 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 7 సార్లు నెగ్గగా.. పాకిస్తాన్ 5 సార్లు గెలిచింది. మరో మ్యాచ్ ఫలితం తేలలేదు. ఈసారి ఏమవుతుందో?