
CM Jagan: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. నాన్నా.. మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
భౌతికంగా మా మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు అని రాసుకొచ్చారు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయన్నారు.
మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయని ఎక్స్ లో తెలిపారు. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్.
Twitter: ట్విటర్‌కు మోదీ సర్కార్ బెదిరింపులు.. జాక్ డోర్సే సంచలనం.. కేంద్రం ఆగ్రహం