
Korutla deepthi death mystery(Latest news in telangana):
కోరుట్ల దీప్తి కేసులో పురోగతి సాధించారు పోలీసులు. చెల్లి చందనతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులో వీరిని గుర్తించారు. దీప్తి మృతిపై వారిద్దరినీ విచారిస్తున్నారు పోలీసులు.
చందన బాయ్‌ఫ్రెండ్ హైదరాబాద్ వాసి. నాలుగు బృందాలతో గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో దీప్తి పోస్టుమార్టం రిపోర్ట్ కీలకం కానుంది. రిపోర్ట్ రావడానికి మరింత సమయం పడుతుందని అంటున్నారు.
అసలేం జరిగిందంటే….
కోరుట్లలో సంచలనం రేపింది దీప్తి కేసు. ఇంట్లోని సోఫాలో చనిపోయి ఉంది దీప్తి. కిచెన్‌లో రెండు మద్యం బాటిళ్లు దొరికాయి. దీప్తి చెంపపై, మెడపై, చాతిపై గాయాలున్నాయి. అదే సమయంలో మృతురాలి చెల్లెలు చందన బాయ్‌ఫ్రెండ్‌తో పరార్ అయింది. దీప్తి మృతిపై చందనపైనే అనుమానాలు వచ్చాయి. అయితే, చందన తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ చేసి.. అక్కను తాను చంపలేదని చెప్పింది. అక్క అడిగితే మద్యం బాటిళ్లు తెప్పించానని.. హాఫ్ బాటిల్ తాగేసి అక్క సోఫాలో పడుకుందని.. తాను లేపినా లేవలేదంటూ వివరణ ఇచ్చుకుంది. అయితే, చందన మెసేజ్‌తో పోలీసులకు మరింత అనుమానం పెరిగింది.
మరోవైపు, 40 తులాల బంగారం, రెండు లక్షల నగదు ఇంట్లో నుంచి చందన తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. చందన విదేశాలకు పారిపోతుందనే అనుమానంతో.. లుక్ ఔట్ నోటీసులు సైతం జారీ చేసారు పోలిసులు. ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి చందనను, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను హైదరాబాద్‌లో పట్టుకున్నారు. విచారణలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ కేసులో దీప్తి పోస్ట్‌మార్టం రిపోర్ట్ కీలకం కానుంది. ఆ రిపోర్ట్ కోసం వెయిటింగ్.
KCR : త్వరలో పింఛన్లు పెంపు.. సూర్యాపేట జిల్లాకు వరాలు.. కేసీఆర్ ఎన్నికల తాయిలాలు..