E-Paper
Advertisement

IPL 2023: ఐపీఎల్‌లో రష్మిక, తమన్నా.. నాటు నాటు స్టెప్పులతో హంగామా..

IPL 2023: ఐపీఎల్‌లో రష్మిక, తమన్నా.. నాటు నాటు స్టెప్పులతో హంగామా..
Advertisement
ipl 2023 dance

IPL 2023: ఐపీఎల్. 16వ సీజన్. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. ఆ సమయం రానే వచ్చింది. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అభిమానులతో కిక్కిరిసింది. గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 2023 స్టార్ట్ అయిపోయింది.

అంతకుముందు.. అంతకుమించి ఎంటర్‌టైన్‌మెంట్. ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో ప్రముఖ హీరోయిన్లు రష్మిక మందన్న(Rashmika Mandanna), తమన్నా(Tamannaah)లు ఫుల్ హంగామా చేశారు. లేటెస్ట్ సాంగ్స్‌కు డ్యాన్సులతో స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు.

Advertisement

పుష్పతో పాన్ ఇండియా వైజ్ క్రేజ్ సంపాదించిన రష్మిక.. ఆ సినిమాలోని ‘సామీ సామీ’, ‘శ్రీవల్లి’ తదితర పాటలకు డ్యాన్స్ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకూ హుషారైన స్టెప్పులేసి జోష్ నింపారు.

రష్మికతో పాటు ఎనర్జిటిక్ డ్యాన్సర్, హీరోయిన్ తమన్నా సైతం డ్యాన్స్‌తో అదరగొట్టారు. ‘పుష్ప’లోని ‘ఊ.. అంటావా మావా.. ఊ ఊ.. అంటావా’ ఐటమ్ సాంగ్‌కు తమన్నా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. హిందీ మూవీ ‘ఎనిమీ’లోని ‘టమ్‌ టమ్‌’ పాటకు తమన్నా స్టెప్పులు అదుర్స్‌.

Advertisement

రష్మిక, తమన్నాల డ్యాన్సులతో పాటు సింగర్ అర్జిత్‌సింగ్ తన పాటలతో ఆడియన్స్‌ను అలరించారు. అలా, మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2023 అట్టహాసంగా ప్రారంభమైంది. అసలు సిసలు క్రికెట్ మజా స్టార్ట్ అయిపోయింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×