BigTV English

BRS: కేజ్రీవాల్ చెబితే బీఆర్ఎస్‌కు 75 కోట్లు ఇచ్చా.. తీహార్ జైల్ ఖైదీ సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు..

BRS: కేజ్రీవాల్ చెబితే బీఆర్ఎస్‌కు 75 కోట్లు ఇచ్చా.. తీహార్ జైల్ ఖైదీ సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు..
Sukesh ChandraShekar

BRS: బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. మనీలాండరింగ్‌ కేసులో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెబితే.. తాను బీఆర్ఎస్‌కు 75 కోట్లు ఇచ్చానని చెప్పారు.


ఒక్కోసారి 15 కోట్లు చొప్పున.. మొత్తం ఐదుసార్లు 75 కోట్లు ఇచ్చానని షాకింగ్ విషయం చెప్పారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసు ముందు పార్కింగ్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి తాను ఆ డబ్బులు అందించానని చెప్పుకొచ్చారు.

సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్రజైన్ చెబితేనే తాను ఆ 75 కోట్లను బీఆర్ఎస్‌ వ్యక్తికి ఇచ్చానని సుఖేష్ అంటున్నారు.


తన దగ్గర కేజ్రీవాల్‌తో చేసిన వాట్సాప్ చాటింగ్ ఉందని.. త్వరలోనే దాన్ని బహిర్గతం చేస్తానని అన్నారు.

వాట్సాప్ చాటింగ్ మొత్తం కోడ్ పదాలతో ఉంటుందని తెలిపారు. 15 కోట్లు ఇవ్వాలనే విషయాన్ని 15 కేజీల నెయ్యి అంటూ కేజ్రీవాల్ తనతో చాట్ చేశారని అన్నారు. ఆ మొత్తం చాటింగ్ బయటకి తీస్తే.. 700 పేజీలు ఉంటుందని చెప్పారు. కేజ్రీవాల్ అవినీతి, అక్రమాలకు ఇది టీజర్ మాత్రమేనని, త్వరలోనే మరిన్ని అక్రమాలు బయటపెడతానని అన్నారు సుఖేష్ చంద్రశేఖర్. అయితే, అతని మాటల్లో నిజమెంత అనేది తేలాల్సిఉంది.

సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ అని, అమిత్ షా రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే సుఖేష్ మాట్లాడుతున్నాడని మండిపడుతున్నారు. జైల్లో ఉన్న దొంగ.. బీజేపీ తోలుబొమ్మగా మారాడని అంటున్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×