టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు 268 వన్డే మ్యాచ్ లో ఆడాడు. ఈ నేపథ్యంలోనే తన కెరీర్ లో 60 అర్థ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. 32 సెంచరీలు ఇందులో ఉన్నాయి. అలాగే మూడు డబుల్ సెంచరీలు చేసుకున్న ఏకైక మొనగాడు రోహిత్ శర్మ కావడం విశేషం. టీమిండియాలో ఓపెనర్ గా పదే పదే రోహిత్ శర్మకు మాత్రమే అవకాశం వస్తుంది కాబట్టి, ఈ రేంజ్ లో రోహిత్ శర్మ రెచ్చిపోయాడని చెప్పవచ్చు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై మొన్న రెండో వన్డేలో ఇవాళ మూడవ వన్డేలో అర్ధ సెంచరీలు నమోదు చేసుకున్నాడు.
సిడ్నీ మైదానంలో రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. గతంలో ఈ గడ్డపై అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ, ఇవాల్టి మ్యాచ్ లో కూడా రెచ్చిపోయాడు. ఇక సిడ్నీ వేదికగా రోహిత్ శర్మ ఆడిన గత ఐదు ఇన్నింగ్స్ లు పరిశీలిస్తే.. 50, 30,50, సెంచరీ ఇప్పుడు మరో అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఇక తన అంతర్జాతీయ క్రికెట్లో సిడ్ని వేదికగా ఇదే ఆఖరి వన్డే కానుంది. మరో రెండేళ్ల లోపు ఎప్పుడైనా రోహిత్ శర్మ రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆస్ట్రేలియా పై ఇప్పటికే రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లీ కూడా కాసేపటికి క్రితమే హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 56 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఇవాళ్టి మ్యాచ్ లో ఆచితూచి ఆడిన విరాట్ కోహ్లీ, అర్థసెంచరీ పూర్తి చేసుకుని, ఫామ్ లోకి వచ్చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ 75 అర్ధసెంచరీలు నమోదు చేసుకున్నాడు.