IND VS AUS: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మూడవ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సిడ్నీ వేదికగా( Sydney Cricket Ground) టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Australia vs India, 3rd ODI) మధ్య ఇవాళ ఉదయం మూడవ వన్డే ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రెండు వన్డేలలో దారుణంగా విఫలమైన టీమిండియా, మూడవ మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన శుభమాన్ గిల్ సేన… మూడవ వన్డేలో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో 2-1 తేడాతో సిరీస్ ను టీమిండియా ముగించింది. అటు ఈ విజయంతో గిల్ కెప్టెన్సీలో తొలి వన్డేను గెలుచుకుంది టీమిండియా. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి, 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఒకే వికెట్ కోల్పోయి 38.3 ఓవర్లలో 237 పరుగులు చేసింది టీమిండియా.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఇవాల్టి మూడవ వన్డేలో ROKO కాంబినేషన్ అదరగొట్టింది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవాలని చాలామంది ఒత్తిడి తీసుకువస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్ లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రమాదకరమైన ఇన్నింగ్స్ ఆడారు. 105 బంతుల్లో రోహిత్ శర్మ సెంచరీ చేయగా, అటు విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ తో రెచ్చిపోయాడు. ఆదుకోవాల్సిన టీమిండియా కొత్త కెప్టెన్ గిల్ తొందరగానే, అవుట్ అయినప్పటికీ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. దీంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఒక్క వికెట్ నష్టపోకుండా టీమ్ ఇండియాను చివరి వరకు తీసుకువెళ్లి విజయ తీరాలకు చేర్చారు. దీంతో సిరీస్ కోల్పోయినా, చివరి మ్యాచ్ లో విజయం సాధించి, పరువు కాపాడుకుంది టీమిండియా.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఘోర అవమానం ఎదురైంది. హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ, కొంతమంది టీమిండియా అభిమానులు సిడ్ని స్టేడియంలో ప్లకార్డులు పట్టుకొని కనిపించారు. గౌతమ్ గంభీర్ ను తొలగించి, రవి శాస్త్రిని టీమిండియా హెడ్ కోచ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ప్లకార్డులలో రాసి, స్టేడియంలో ప్రదర్శించారు అభిమానులు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని జట్టులోంచి పంపించేందుకు గౌతమ్ గంభీర్ కుట్రలు పన్నుతున్నాడని, అందుకే రవి శాస్త్రి ని తీసుకువస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అడుగడుగున గౌతమ్ గంభీర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఫ్యాన్స్.
A poster was spotted in the stands calling for Gautam Gambhir to be sacked and Ravi Shastri to be brought back as India’s coach! 🏏 pic.twitter.com/yICrfb6vyG
— CricketGully (@thecricketgully) October 25, 2025